తెలంగాణ

నేడు సంచార పశు వైద్యశాలలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: దేశంలో తొలిసారిగా వంద సంచార పశు వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఈ వాహనాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభిస్తారు. 1962 టోల్ నంబర్‌కు కాల్ చేసిన 30 నిమిషాల్లోనే రైతు వద్దకు చేరే విధంగా ఏర్పాటు చేశారు. 100 గ్రామీణ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి ఒకటి చొప్పున వంద వాహనాలు ఏర్పాటు అందుబాటులో ఉంటాయి. ఒక్కో వాహనానికి 14.65లక్షల చొప్పున ఖర్చు చేశారు. రాష్ట్రంలో 900 పశు వైద్య శాలలు, 100 గ్రామీణ పశు వైద్యశాలలు ఉన్నప్పటికీ గ్రామాల్లో పశువులకు అత్యవసర వైద్యం అందక చనిపోతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని సంచార వైద్య శాలలు ఏర్పాటు చేసినట్టు తలసాని తెలిపారు. ఏటా 30 కోట్ల వ్యయంతో ఈ సంచార పశు వైద్యశాలలు నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చెప్పారు.