రాష్ట్రీయం

ఇంటింటికీ మంచి నీరు పథకం అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుకు గురువారం ప్రత్యేకంగా లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ లేఖలో ప్రధాని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించే అద్భుతమైన కార్యక్రమం చేపట్టిందని ప్రధాని తన లేఖలో అభినందించారు. ప్రస్తుతం ఉన్న నదులు, సరస్సులు, చెరువులను కాపాడుకోవడంతో పాటు, వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అక్టోబర్ రెండున గాంధీ జయంతిని పురస్కరించుకుని ‘స్వచ్ఛ యే సేవ’ అనే నినాదంతో స్వచ్ఛ భారత్ కోసం కొంత సమయం కేటాయించి, భాగస్వాములు కావాలని మంత్రిని ప్రధాని కోరారు.
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాల మేరకు స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. స్వచ్ఛ భారత్‌ను కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా మాత్రమే సాధించగలుగుతామని ప్రధానమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరు స్వచ్ఛత పాటించాల్సిన అవసరం ఉందని మహాత్మాగాంధీ బోధించారని తెలిపారు. వచ్చేనెలలో జరిగే గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా బాపూజీ బోధించిన స్వచ్ఛత ప్రతిజ్ఞ తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛత హీ సేవా అనే నినాదంతో ముందుకు పోదామని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా స్వచ్ఛత కార్యక్రమాలను తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ రెండున స్వచ్ఛ యే సేవ నినాదంతో స్వచ్ఛ భారత్‌లో భాగస్వామ్యం కావాలని ప్రధాని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గుర్తించినందుకు ప్రధానమంత్రికి కెటి రామారావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌లో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో తడి,పొడి చెత్త సేకరణ , స్వచ్ఛ ఆటోలు, వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి వినూత్న అంశాలతో ముందుకు పోతున్నట్టు కెటిఆర్ తెలిపారు. ప్రధానమంత్రి సందేశం మేరకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళతామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు.