తెలంగాణ

రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: నవ భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తిప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం నగరంలోని ట్యాంక్‌బండ్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అన్ని పార్టీల ప్రముఖలు, నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపిలు కవిత, వి.హనుమంతరావు, మంత్రులు జగదీశ్‌రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డి, మాజీ టిపిఎస్‌సి అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య తదితరులు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంలో అంబేద్కర్ చూపిన దిశానిర్దేశం వల్లే బడుగులకు అన్ని రకాల హక్కులు దక్కాయాని, దీంతో వారికి ఆశాజ్యోతిగా చరిత్రలో నిలిచిపోయారని పలువురు నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూధనాచారి, శాసన మండలి చైర్మన్ కె.స్వామి గౌడ్, డిప్యూటీ సిఎం మహమూద్ ఆలీ, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు కూడా అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అంబేద్కర్ అజెండానే తమ అజెండాగా ముందుకెళుతూ సామాజిక న్యాయానికి బిజెపి కృషి చేస్తోందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అంతా కలిసి రావాలని ఆయన కోరారు. అట్టడుగు వర్గాల సంక్షేమానికి అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే అంబేద్కర్‌కు నిజమైన ఘన నివాళి అని లక్ష్మణ్ అన్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర ఎస్‌సి మోర్చా అధ్యక్షుడు కె.రాములు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజాస్వామ్యానికి వనె్నతెచ్చిన ఘనుడు
భారతదేశంలో ప్రజాస్వామ్యం బహుళ ప్రజాదరణ పొందడానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వేసిన పునాదే కారణమని టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప దార్శనికుడని కొనియాడారు.
మతోన్మాద శక్తులతో జాగ్రత్త
దేశంలో మతోన్మాద శక్తులతో అప్రమత్తంగా ఉండాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ఐకమత్యంగా ముందుకు వెళ్లాలన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు అంబేద్కర్‌కు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.
హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు కోర్టు ఆవరణలో నిర్వహించారు. అంబేద్కర్ చూపిన దారిలో ప్రయాణించి, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని పలువురు వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, జస్టిస్ జి.చంద్రయ్య తదితరులు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
లోక్‌సత్తా ఆధ్వర్యంలో..
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించడమే నిజమైన అంబేద్కరిజం అని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించడంలో రాజ్యవ్యవస్థ పాత్ర ఎలా ఉండాలో అంబేద్కర్ లోతుగా అర్ధం చేసుకున్నారని అన్నారు.
టిఎస్‌ఆర్‌టిసి ఆధ్వర్యంలో..
దేశ అభ్యున్నతి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల జీవనవిధానం, ఆలోచన సరళి అందరికిదరికి స్పూర్తిదాయకమని టిఎస్‌ఆర్‌టిసి జాయింట్ ఎండి జి.వి.రమణారావు అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను ఆర్టీసి కళాభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు అందరికీ స్ఫూర్తి దాయకమని అన్నారు.