తెలంగాణ

కాళ్వేశ్వరం ప్రాజెక్టు సొరంగ పనుల్లో ఏడుగురు కూలీలు..మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట (సిరిసిల్ల రాజన్న జిల్లా), హైదరాబాద్, సెప్టెంబర్ 20: కాళ్వేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీ సొరంగ పనుల్లో బుధవారం పెను ప్రమాదం చోటుచేసుకుం ది. రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ సమీపంలో చేపట్టిన సొరంగ పనుల్లో ఎయిర్ బ్లాక్ పడిపోవడంతో సొరంగం పైకప్పు నుంచి పది మీట ర్ల బండ కాంక్రీట్ పనులు చేస్తున్న కూలీలపై పడింది. దీంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులు ఇద్దరిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరొకరు మృతిచెందారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఉన్నాయి. ఇదిలావుంటే, ఏడుగురు కార్మికులు మృతి చెందడం పట్ల సిఎం కెసిఆర్, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌లో కాళేశ్వరం 10వ ప్యాకేజీలో టనె్నల్ నిర్మాణం పనులు జరుగుతున్నాయ. ఎయిర్ బ్లాస్టింగ్‌తో టనె్నల్ పైకప్పు కూలింది. ప్రమాదంలో సందీప్ (్భపాలపల్లి జిల్లా), జితేందర్ సింగ్ (బీహార్), హరి (ఒడిశా), హరిరాం (్ఛత్తీస్‌గఢ్), గౌడమ (జార్ఖండ్), హకీం (జార్ఖండ్) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఇద్దరు క్షతగాత్రులను కరీంనగర్‌లోని ప్రతిమా ఆసుపత్రికి తరలించగా, వీరిలో పురంసింగ్ (బీహార్) అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. టనె్నల్ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న తరుణంలో ప్రమాదం చోటుచేసుకోవడం కూలీల్లో విషాదం నింపింది. రోజువారీగా బుధవారం టనె్నల్ నిర్మాణం పనులు పూర్తవుతాయని భావించిన ప్రాజెక్టు ఇంజనీర్లు 8 మంది కూలీలతో రెండు కిలోమీటర్ల లోతులో జరుగుతున్న టనె్నల్ నిర్మాణం పనుల్లోకి వెళ్లారు. ఇంజనీర్లు వారి విధులు నిర్వహించుకొని బయటకు వచ్చారు. కూలీలు సైతం పనైందని తిరిగి సొరంగం నుంచి బయటకు వస్తున్న తరుణంలో ఒకేసారి టనె్నల్ పైకప్పు కూలి ప్రమాదం సంభవించింది. ప్రాజెక్టు అధికారులు మృతుల రికార్డులు లేకుండా చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న డిఐజి రవివర్మ, కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ విశ్వజిత్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకొని విచారించారు. సంబంధిత ప్రాజెక్టు అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల మరింత సమాచారం కోసం విచారణ చేయనున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణం తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఎస్పీ పేర్కొన్నారు. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇదిలావుంటే, ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు కాంట్రాక్టు ఏజన్సీ ప్రకటించిందని మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే జలసౌధ నుంచి సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి స్వయంగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. మృతుల్లో ఆరుగురు జార్ఖండ్, ఒకరు ఒడిశా రాష్ట్రానికి చెందినవారని చెప్పారు. డ్రాఫ్ట్ ట్యూబ్ పై కప్పులోని ఎయిర్ ప్యాకెట్స్ అనూహ్యంగా పేలడం వల్ల ప్రమాదం సంభవించినట్టు నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు తెలిపారు. అదే సమయంలో కార్మికులు భోజన విరామం కావడంతో కొందరు కార్మికులు, ఇంజనీర్లు బయటికి వచ్చినప్పటికీ కొందరు కార్మికులు అక్కడే ఉండిపోవడం వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ నివేదిక వచ్చాక నిపుణుల సూచనలు, సలహాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.