తెలంగాణ

ఎటూ తేలని ఫీజుల కమిటీ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: పాఠశాలల ఫీజుల నిర్ధారణకు నియమించిన ప్రొఫెసర్ టి తిరుపతి రావు కమిటీ నివేదిక తయారీ కోసం ప్రైవేటు స్కూళ్ల ఆదాయ వ్యయాల నివేదికలను సమర్పించాల్సిన గడువును మరో నెల రోజులు పొడిగించింది. దాంతో ఫీజుల నిర్ధారణ ఇప్పట్లో అయ్యేలా లేదనేది స్పష్టమవుతోంది. పాఠశాలలు ప్రారంభానికి ముందు అంటే ఏప్రిల్ చివరిలోనే ఫీజుల స్లాబ్‌లను నిర్ధారించాల్సి ఉంది. ఫీజులను చూసిన తర్వాత ఆయా పాఠశాలల్లో చేరడంపై తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటారు. కాని 2017-18 విద్యాసంవత్సరంలో ఫీజులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియంత్రిస్తామని ప్రభుత్వం చెబుతూనే కాలయాపన చేసేసింది. విద్యార్థి సంఘాల నుండి , తల్లిదండ్రుల నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో చివరికి ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం నియమించింది.
కమిటీ పలు రాష్ట్రాల్లో ఫీజుల స్థితి గతులను పరిశీలించడంతో పాటు గతంలో ఉన్నత స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలను సైతం అధ్యయనం చేసింది. ఇంకోపక్క తల్లిదండ్రుల సంఘాలతోనూ చర్చించింది. అంతా పూర్తయి విస్తృతస్థాయి కమిటీలో అంశాల వారీ చర్చించి ముసాయిదా సిద్ధం చేసిన తర్వాత వివిధ పాఠశాలల ఆదాయ వ్యయాలను కూడా పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. దాంతో పాఠశాలలు తమ ఆదాయ వ్యయాల నివేదికలను ఇవ్వాలని డిఇఓల ద్వారా యాజమాన్యాలకు సూచించింది. అయితే చాలా పాఠశాలలు ఈ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో వారికి మరో నెల రోజుల పాటు గడువు ఇస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ కిషన్ తెలిపారు. ఇంత వరకూ కేవలం 110 పాఠశాలలు మాత్రమే తమ నివేదికలు ఇచ్చాయని, ఇంకా 12వేల పాఠశాలలు నివేదికలు ఇవ్వాల్సి ఉందని తెలిసింది. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 37లోనే ఏప్రిల్ 20 నాటికి నివేదిక ఇవ్వాలని సూచించింది. గడువు మీరిపోయి ఐదు నెలలు గడుస్తున్నా ప్రైవేటు స్కూళ్ల నిర్లక్ష్యంతో నివేదిక పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. అన్ని విషయాలూ సిద్ధంగా ఉన్నా ప్రైవేటు పాఠశాలల ఆదాయ వ్యయాల నివేదికలు అందకపోవడంతోనే అసాధారణ ఆలస్యం జరుగుతోందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ సాచివేత ధోరణితో ఈ ఏడాది కూడా ఫీజుల నియంత్రణ సాధ్యమవుతుందో లేదో అనే ఆందోళనలో తల్లిదండ్రులున్నారు. ఫీజుల కమిటీ సభ్యులకు కూడా తెలియజేయకుండా గడువు పెంచుకుంటూ పోవడం అన్యాయమని , ఈ విషయంపై కమిటీ వెంటనే సమావేశం కావాలని తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ డిమాండ్ చేశారు.