తెలంగాణ

నెలాఖరు నుంచే భగీరథ నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: మిషన్ భగీరథ పనులు పూర్తయిన అన్ని ప్రాంతాలకు ఈ నెల చివరి నుండి తాగునీటిని సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ సురేందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల్లో పనిచేస్తున్న భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్లతో గురువారం ఆయన వీడియో సమావేశంలో మాట్లాడుతూ, పూర్తయిన మిషన్ భగీరథ పనులు, ఇతర పనులపై శుక్రవారం సాయంత్రంలోగా సమగ్ర నివేదికను తనకు అందించాలని ఎస్‌ఇలను కోరారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వందకోట్ల రూపాయలతో చేపట్టిన ఇంట్రావిలేజ్ పనులు ఈ నెల చివరి వరకు పూర్తిచేసి 70 వేల ఇళ్లకు తాగునీటిని అందించాలని ఆదేశించారు. ఇంట్రావిలేజ్ పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ డిఇపై శాఖాపరమైన విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత చీఫ్ ఇంజనీర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.