తెలంగాణ

ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కంచె ఐలయ్యపై కేసులు నమోదై ఉంటే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గురువారం హోంమంత్రి నాయిని మీడియాతో మాట్లాడుతూ, బతుకమ్మ చీరల వివాదంపై ఆయన స్పందించారు. బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని, ప్రతిపక్ష పార్టీల సర్పంచ్‌లు చీరలను తగులబెట్టిస్తన్నారన్నారు. రాష్ట్రంలో హోంగార్డుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. కాగా, ఆర్యవైశ్యులపై సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు పుస్తకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపుతోంది. ఈ నేపథ్యంలో రచయిత కంచె ఐలయ్యపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆర్యవైశ్య సంఘాలు పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి స్పందిస్తూ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.
కార్మికులకు చెక్కుల పంపిణీ
భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు హోంమంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఇటీవల మరణించిన ముగ్గురు కార్మికులకు, ప్రసూతి సహాయంగా, అంత్య క్రియల నిమిత్తం మొత్తం 14,50,000లు అందజేశామని మంత్రి తెలిపారు.