తెలంగాణ

తెలంగాణ కావాలి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: పిల్లలపై లైంగిక వేధింపులు లేకుండా, మానవ అక్రమ రవాణా జరగకుండా తీసుకునే చర్యల్లో తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారేలా చర్యలు తీసుకోవాలని నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి పిలుపునిచ్చారు. పిల్లలపై లైంగిక వేధింపులను నిరోధించాలని, మానవ అక్రమ రవాణా జరగకుండా చూడాలని కోరుతూ, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా చేపట్టిన ‘్భరత్ యాత్ర’లో భాగంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో సత్యార్థి మాట్లాడుతూ, తమపై జరుగుతున్న అకృత్యాలను బహిర్గతం చేసేందుకు చిన్నపిల్లలు, మహిళలు నిశ్శబ్దాన్ని వీడి ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. మహిళలు, పిల్లలు తమపై జరిగే అకృత్యాలను బహిర్గతం చేయలేకపోతున్నారని, పరువు పోతుందన్న కారణంతో నిశ్శబ్దంగా ఉండిపోతున్నారని సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. నిశ్శబ్దాన్ని వీడితేనే సమాజానికి మేలు జరుగుతుందని ఆయన సూచించారు. సమాజం ఇప్పుడిప్పుడే మారుతోందని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు.
కైలాస్ సత్యార్థి చేపట్టిన భారత్ యాత్రకు మద్దతుగా గురువారం మోజం జాహీ మార్కెట్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు విశే్వశ్వర్‌రెడ్డి, కేశవరావు, వినోద్‌కుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్, శాంతాసిన్హా, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.
మిషన్ కాకతీయ భేష్
నీటి వనరులను, చెరువులు, కుంటలను పరిరక్షించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని కైలాస్ సత్యార్థి ప్రశంసించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సత్యార్థి గురువారం శాసనసభను సందర్శించారు. శాసనసభ ఆవరణలో ఎనిమిది నిమిషాల నిడివి కలిగిన మిషన్ కాకతీయ డాక్యుమెంటరీని తిలకించారు. మిషన్ కాకతీయ తరహాలో పథకాలు దేశవ్యాప్తంగా చేపడితే జలసంరక్షణకు వీలవుతుందని పేర్కొన్నారు.
గురువారం అసెంబ్లీని సందర్శించి ఆవరణలోని

చిత్రం.. రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న కైలాస్ సత్యార్థి