తెలంగాణ

పరిశుభ్రత అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: పరిశుభ్రత అందరి బాధ్యత అని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్ కాలనీలో చెత్తాచెదారాన్ని వేసేందుకు ప్రత్యేక బక్కెట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ కాలనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో గవర్నర్ మాట్లాడుతూ, మొత్తం రాష్ట్రానికే రాజ్‌భవన్ కాలనీ ఆదర్శంగా ఉండేలా చూడాలని సూచించారు.
ప్రతి ఇల్లు పరిశభ్రంగా ఉంటే, గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. పరిశుభ్రమైన ఇంట్లో ఆరోగ్యకర వాతావరణం ఉంటుందన్నారు. ప్రతి ఇంటివారు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తడిచెత్తను, పొడిచెత్తను వేర్వేరు బక్కెట్లలో వేయడం వల్ల ఆ చెత్తను ఎరువుగా వాడేందుకు వీలవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.