తెలంగాణ

రాష్ట్రంలో పోలీసు రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: సమైక్య రాష్ట్ర పాలన నుండి నేడు తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. నల్గొండ ఉప ఎన్నిక జరిగే పక్షంలో దానికీ, సార్వత్రిక ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలన, అహంకార ధోరణి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని , దానివల్లనే వందలాది టిఆర్‌ఎస్ నేతలు బిజెపిలో చేరుతున్నారని ఆయన తెలిపారు. శుక్రవారం నాడు పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవినీతిలో కాంగ్రెస్‌తో టిఆర్‌ఎస్ పోటీపడుతోందని, ప్రాజెక్టుల్లో నీరు పారడం మాట ఏమోగానీ, డబ్బు పారుతోందని వేల కోట్ల రూపాయిలు అవినీతి డబ్బు చేతులు మారుతోందని అన్నారు. అవినీతి ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉండవని, 2019లో జరిగే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఇటీవల బతుకుమ్మ చీరల పంపిణీలో జరిగిన అవినీతి, అవకతవకల ద్వారా టిఆర్‌ఎస్ పార్టీ అవినీతి ఇంటింటికీ చేరిందని అన్నారు. ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడమే గాక, వారిని అగౌరవపరుస్తున్నారని , తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారి పెత్తనాన్ని వారు జీర్ణించుకోలేకపోయారని అన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కాదని, ముఖ్యమంత్రి కొత్తది కడతానని అంటున్నారని, ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని, ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోవడం ఒక వింత అని, పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందని ఆయన ప్రశ్నించారు. రవీంద్రభారతి ముత్యం చిప్ప మాదిరి ఇందిరాపార్కులో కడతానంటారు, ఎన్టీఆర్ స్టేడియాన్ని కళాక్షేత్రాన్ని మారుస్తానని అంటున్నారు, హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతానని అంటున్నారని, ముఖ్యమంత్రి గారడి మాటలు ఎక్కువ రోజులు కొనసాగవని, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, రైతు సమన్వయ కమిటీలు టిఆర్‌ఎస్ కమిటీలేనని, సర్పంచ్‌లుగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను అగౌరవపరిచే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, ముఖ్యమంత్రికి నచ్చితే నజరానా, లేకుంటే జరిమానా అన్నట్టు ప్రభుత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు. సమైక్యపాలన నుండి నేడు పోలీసు రాజ్యం సాగుతోందని, నిజాం పాలననను మైమరిపించే రీతిలో ఉందని, రైతులకు బేడీలు వేయడం, నేరెళ్లలో ఎస్సీ, ఎస్టీలపై పోలీసు దాడులు కొన్ని ఉదాహరణలు మాత్రమేనని అంటూ డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ పోలీసు రాజ్యాన్ని ఎక్కువ కాలం కొనసాగనీయమని, బిజెపి తీవ్ర పోరాటాన్ని కొనసాగిస్తుందని లక్ష్మణ్ హెచ్చరించారు. మతోన్మాద మజ్లీసు పార్టీ ఒక వైపు, మరో వైపు తెలంగాణ వ్యతిరేకేంచిన వారి మద్దతతో బంగారు తెలంగాణ సాధిస్తామంటున్నారని, ప్రజలు గుణపాఠం చెప్పే రోజు త్వరలో వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు మల్లారెడ్డి, వై గీత, చింతా సాంబమూర్తి, టి ఆచారి, పాల్గొన్నారు.