తెలంగాణ

27న పాడి రైతుల హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) అధ్వర్యంలో ఈ నెల 27న పాడి రైతులు 3,90,000 వేల మొక్కలు నాటనున్నారు. హరితహారంలో భాగంగా తెలంగాణకు చెందిన సుమారు 65 వేల పాడి రైతులు ఒక్కోక్కరు ఆరు మొక్కలు చొప్పున నాటుతారని విజయ డెయిరీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు మొక్కలు సిద్ధం చేసినట్లు తెలిసింది. గ్రామాల్లో, జిల్లాల్లో ఉన్న పాల సేకరణ కేంద్రాల్లో, డెయిరీలు, పాల శీతలీకరణ కేంద్రాల్లో, బిఎంసియులలో పెద్ద ఎత్తున హరతహారం కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వివరించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొంటారని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి కోరారు.