తెలంగాణ

23 నుండి పిఇసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: డిపిఇడి, బిపిఇడి కోర్సుల్లో చేరేందుకు తుది దశ కౌనె్సలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. వెబ్ ఆప్షన్లు 23,24,25 తేదీల్లో ఉంటుందని, 27న సీట్ల కేటాయింపు జరుగుతుందని, అడ్మిషన్లకు అక్టోబర్ 5 వరకూ గడువు ఉంటుందని చెప్పారు. ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే వాటిని అక్టోబర్ 7వ తేదీన భర్తీ చేస్తారు.
గురుకుల పిజిటి మెయిన్స్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థల్లో పిజిటి తెలుగు, ఉర్దూ భాషా పండితుల పోస్టుల ప్రధాన పరీక్ష ఫలితాలను వెల్లడయ్యాయి. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ధ్రువపత్రాలు పరిశీలనకు ఎంపిక చేసినట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 26న మాసాబ్ ట్యాంకు పాలిటెక్నిక్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ అధికారులు పేర్కొన్నారు.
నేడు ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు
బిఇడి కోర్సులో చేరేందుకు నిర్వహించిన వెబ్ ఆప్షన్లలో 35,526 మంది సీట్లు కోసం వెబ్ కౌనె్సలింగ్‌కు హాజరయ్యారు. వారిలో 34,315 మంది వెబ్ ఆప్షన్లను నమోదుచేశారు. రాష్ట్రంలో 187 బిఇడి కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 16750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల కేటాయింపు శనివారం జరుగుతుందని అధికారులు తెలిపారు.