తెలంగాణ

ఒకరోజు జీతం నిలిపివేత ఉత్తర్వులు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: కామన్ పెన్షన్ స్కీం (సిపిఎస్)కు వ్యతిరేకంగా ఈ నెల 1న జరిగిన సామూహిక సెలవుల పెట్టిన రోజున ట్రెజరీ ఉద్యోగులకు ఆ ఒక్క రోజు వేతనాన్ని చెల్లించరాదన్న ఉత్తర్వులను ఖజానా శాఖ ఉపసంహరించుకుంది. పండుగల రోజుల్లో పూర్తి జీతం తీసుకోకుండా ఉద్యోగులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్న ట్రెజరీ శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తిని మన్నించి జీతం చెల్లించరాదన్న ఉత్తర్వులను ఉపసంహరించుకుని, ఆ ఒక్క రోజు వేతనం కూడా చెల్లించేందుకు తగు ఆదేశాలు జారీ చేశారని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.్భపాల్‌రెడ్డి, కార్యదర్శి పిపిఆర్ మహీపతి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉత్తర్వులు రద్దు చేసినందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.