రాష్ట్రీయం

సినీ నిర్మాత మొరాని లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/హయత్‌నగర్, సెప్టెంబర్ 23: ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముంబయికి చెందిన సినీ నిర్మాత కరీం మొరాని, సుప్రీం కోర్టు ఆదేశాలతో శనివారం హయత్‌నగర్ పోలీసులకు లొంగిపోయారు. సంఘటనకు సంబంధించి హయత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలివుడ్ నిర్మాత కరీమ్ మొరాని, అతని స్నేహితుడి కుమార్తె(25) సినిమాల్లో అవకాశం కోసం 2015లో నిర్మాత కరీమ్‌ను ఆశ్రయించింది. ఆమెకు మాయమాటలు చెప్పిన అతను తన ఇంటికి రమ్మని పిలిచాడు. వైన్‌లో మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు తేరుకున్న సదరు యువతి ముంబయి పోలీసులను ఆశ్రయించింది. ఆమె గోడును అక్కడి పోసులు పట్టించుకోలేదు. అనంతరం 2015లో నగరంలోని రామోజి ఫిల్మ్ సిటీలో కరీం మొరాని తన బృందంతో ఓ సినిమా షూట్ చేస్తుండగా, సమాచారం తెలుసుకున్న సదరు యువతి అక్కడికి చేరుకుంది. మరల కరీమ్ మొరాని ఆమెపై అత్యాచారం చేశాడు. సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ జనవరి 2015లో ఆమె హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని గమనించిన నిర్మాత కరీం మొరాని ముందస్థు బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. అనంతరం ఉమ్మడి కోర్టును ఆశ్రయించాడు. కాగా కోర్టు అతని బెయిల్‌ను రద్దుచేసింది. అనంతరం అతను సుప్రీం కోర్టును ఆశ్రయించగా అతని బెయిల్‌ను రద్దు చేస్తూ, హయత్‌నగర్ పోలీసులకు లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈమేరకు అతను శుక్రవారం రాత్రి 11.45నిమిషాలకు హయత్‌నగర్ పోలీసుల ముందు లొంగిపోయారు. కరీమ్ మొరానిని శనివారం హయత్‌నగర్ 7వ, మెట్రోపాలిటన్ జడ్జి ముందు హాజరు పరచగా, నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించినట్టు హయత్‌నగర్ పోలీసులు తెలిపారు.

చిత్రం..హైదరాబాద్‌లో పోలీసులకు లొంగిపోయన బాలీవుడ్ సినీ నిర్మాత కరీం మొరాని