రాష్ట్రీయం

అక్టోబర్ 4 వరకు బయటకు రాను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ‘అక్టోబర్ 4 వరకు బయటకు రాను, నాకు నేనే గృహ నిర్భందం చేసుకుంటున్నాను, ఎవరితోనూ మాట్లాడను, చివరికి మీడియా నెట్‌వర్క్‌కు కూడా అందుబాటులో ఉండను, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే (ఔషదాలు, ఇతరత్రా అత్యవసర) ఉస్మానియా పోలీసులకు చెప్పి వెళతాను’ అంటూ దళిత నాయకుడు, రచయిత, ఇటీవల ఆర్యవైశ్యులపై వివాదాస్పద పుస్తకం రచించిన కంచె ఐలయ్య పేర్కొన్నారు. తనపై పరకాలలో జరిగిన దాడిని సిపిఐ, సిపిఎం తప్ప మరే ఇతర పార్టీలు ఖండించకపోవడం, తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు సైతం స్పందించకపోవడం, వాక్‌స్వాతంత్య్రానికి రాజ్యాంగబద్దమైన రక్షణ కరువైనందుకు నిరసనగా తనకు తానే ఈ రకమైన గృహ నిర్భంధం విధించుకుంటున్నట్లు వెల్లడించారు. అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలు తనపై జరిగిన దాడిని కనీసం ప్రస్తావించకపోగా ఆర్యవైశ్యులకు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ప్రముఖ మానవ హక్కుల ఉద్యమ నేతలు సైతం తనపై జరిగిన దాడిని ఖండించలేదని మనస్ధాపానికి గురైనట్లు ఐలయ్య తెలిపారు. పరకాలలో తనపై దాడి జరిగిన సమయంలో సమయస్పూర్తిగా వ్యవహరించిన తన కారు డ్రైవర్, రక్షణ కల్పించిన పోలీసు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.