రాష్ట్రీయం

అత్యాచారం కేసులో పోలీస్ కస్టడీకి కరీం మొరాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ మాయమాటలతో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు, సినీ నిర్మాత కరీం మొరానిని హయత్‌నగర్ పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరీం మొరాని అత్యాచారం కేసులో నిందితుడే కాకుండా 2జి-స్ప్రెక్ట్రం కేసులో కూడా నిందితుడని పోలీసులు తెలిపారు. అయితే 14 రోజులు జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న కరీం మొరానిని నాలుగు రోజులు కస్టడీ కోరిన పోలీసుల పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారించనుంది. కాగా, ఈ నెల 28 వరకు కరీం మొరానిని హయత్‌నగర్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్టు ఓ పోలీస్ సీనియర్ అధికారి తెలిపారు. కరీమ్ మొరాని, తన కుమార్తె స్నేహితురాలైన యువతి (25) ముంబయిలో సినిమాల్లో అవకాశం కోసం 2015లో నిర్మాత కరీమ్‌ను ఆశ్రయించింది. ఆమెకు మాయమాటలు చెప్పిన అతను తన ఇంటికి రమ్మని పిలిచాడు. వైన్‌లో మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు తేరుకున్న సదరు యువతి ముంబయి పోలీసులను ఆశ్రయించింది. ఆమె గోడును అక్కడి పోసులు పట్టించుకోలేదు. అనంతరం 2015లో నగరంలోని రామోజి ఫిల్మ్ సిటీలో కరీం మొరాని తన బృందంతో ఓ సినిమా షూట్ చేస్తుండగా, సమాచారం తెలుసుకున్న సదరు యువతి హైదరాబాద్‌కు చేరుకుంది. మరోమారు కరీమ్ మొరాని ఆమెపై అత్యాచారం చేశాడు. సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ జనవరి 2015లో ఆమె హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని గమనించిన నిర్మాత కరీం మొరాని ముందస్థు బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. అనంతరం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు. కాగా హైకోర్టు అతని బెయిల్‌ను రద్దుచేసింది. అనంతరం అతను సుప్రీం కోర్టును ఆశ్రయించగా అతని కింది కోర్టు ఆదేశాలనే అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు కరీం బెయిల్‌ను రద్దు చేస్తూ, హయత్‌నగర్ పోలీసులకు లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈమేరకు కరీం మొరాని హయత్‌నగర్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఇతను గతంలో 2జి స్పెక్ట్రమ్ కేసులో ప్రధాన నిందితుడని కూడా పోలీసులు వెల్లడించారు. కరీమ్ మొరానిని శనివారం హయత్‌నగర్ 7వ, మెట్రోపాలిటన్ జడ్జి ముందు హాజరు పరచగా, నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.