జాతీయ వార్తలు

పెండింగ్‌లో 3కోట్ల కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఏప్రిల్ 16: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండటం పట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గత మూడేళ్లలో ఈ పెండింగ్ కేసులు పెరుగుతున్న వేగం కాస్త తగ్గిందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇక్కడి నేషనల్ జుడీషియల్ అకాడమీలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నాలుగో సదస్సులో సదానంద గౌడ మా ట్లాడుతూ ఈ విషయం చెప్పారు. దేశంలోని వందలాది కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడానికి ప్రభు త్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. నేషనల్ లిటిగేషన్ పాలిసీని కూడా సమీక్షిస్తున్నామని మంత్రి అన్నారు. ‘మధ్యవర్తిత్వం, రాజీ చట్టాలకు సవరణలు చేశాం. వాణిజ్య వివాదాలను వేగవంతంగా పరిష్కరించడానికి ప్రత్యేక వాణిజ్య కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన చట్టాన్ని రూపొందించాం’ అని సదానంద గౌడ తెలిపారు. ఈ చర్యలన్నీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు.