తెలంగాణ

భూ రికార్డుల ప్రక్షాళన భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పట్ల గవర్నర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ఆదివారం వివరించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా, భూరికార్డుల ప్రక్షాళన మిషన్ ప్రత్యేకాధికారి వాకాటి కరుణ గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా తెలియచేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రభుత్వ చేపట్టిన ఈ కార్యక్రమం దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు.
రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ కార్యక్రమం పూర్తయితే ఏ సర్వే నెంబర్ భూమి ఎవరిపేరుతో, ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలోని 10,878 గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళనా కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. రాష్ట్రంలో 178 లక్షల సర్వే నెంబర్లతో 245 లక్షల ఎకరాలున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 75.54 లక్షల మంది పేరుతో భూముల పట్టాలున్నాయన్నారు. భూములు ఒకరిపేరుతో పట్టా ఉంటే మరొకరు సాగు చేస్తున్నారని, ఒకే సర్వే నెంబర్‌లో ఒకరికి మించి పట్టేదారులు ఉన్నారన్నారు. ప్రస్తుతం భూములకు సంబంధించిన సమాచారం అసమగ్రంగా ఉందని, అనేక లోపాలున్నాయని అందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామన్నారు.
ప్రక్షాళనా కార్యక్రమం పూర్తయితే ఏ భూమి ఎవరిపేరుతో ఉందో స్పష్టమవుతుందని వెల్లడించారు. నెల 15 న భూరికార్డుల ప్రక్షాళనా కార్యక్రమం ప్రారంభమైందని, సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి భూరికార్డులను పరిశీలిస్తున్నారన్నారు. దాదాపు 1468 బృందాలు ఈ బృహత్ కార్యక్రమంలో పనిచేస్తున్నాయని గవర్నర్‌కు వారు వివరించారు. ఇప్పటికే దాదాపు 80 శాతంపైగా స్పష్టత వచ్చిందన్నారు.

చిత్రం..భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని గవర్నర్‌కు వివరిస్తున్న అధికారులు