తెలంగాణ

ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 24: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి పేద కుటుంబాల్లో వెలుగునింపాలనే ధ్యేయం తో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కులవృత్తులకు ప్రోత్సాహం కల్పిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్దిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దివ్యాగార్డెన్స్‌లో నిర్వహించిన గొర్రెల పంపిణి కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు గొర్రెలను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో నివసించే ప్రజలు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ఇక్కడ అమలుచేస్తున్నారన్నారు. రైతాం గం మేలుకోసం ఉచితంగా 9 గంటల విద్యుత్‌ను అందజేస్తున్నామని, వచ్చే ఏడాది నుండి దీనిని 24 గంటలకు పెంచనున్నామన్నారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం కిలోమీటర్ల కొద్ది క్యూలో నిలిచేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులను ఈ ప్రభుత్వం అందిస్తోందన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్దరణ చేయడం జరిగిందని, మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే జనవరి నుండి ఇంటింటికి తాగునీటిని అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
కులవృత్తులను, బడుగు, బలహీనవర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, రూ.5 వేల కోట్లతో గొల్ల, కుర్మ, యాదవులకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపి ణి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 22 లక్షల గొర్రెలు వచ్చాయని, వీటిని లబ్దిదారులకు అందజేశామన్నారు. కులవృత్తులను కాపాడేందుకు బడ్జెట్‌లో వెయ్యి కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉంటే జీవాలకు వైద్య సేవలను అందించేందుకు వైద్యులతోపాటు ఒక కంపౌండర్, మందులతోకూడిన సంచార వాహనాన్ని ఏర్పాటుచేశామన్నారు.
సమైక్యాంధ్రలో కేవలం ఆంధ్రా ప్రాంతంలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, రాజమండ్రిలోనే చేపలు దొరికేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గంగపుత్రులకు ఆదాయ వనరులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపలను పెంచే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. ఈయేడాది 70 కోట్ల చేప పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో విడుదల చేస్తున్నామన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.75116 లను పేదలకు అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం పశుసంచారవైద్యశాల మొబైల్ వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే మిల్క్ టెస్టర్లను పంపిణీ చేశారు. గొర్రెల యూనిట్లు కూడా మరో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ 75 శాతం సబ్సిడీపై గొర్రెలను గొల్ల, కుర్మ, యాదవులకు పంపిణి చేస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లాలో అడవులు, ఖాళీ స్థలాల్లో గొర్రెలను పెంచడానికి అనుకూలంగా ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జాఫర్, నిర్మల్ మార్కెట్ కమిటి ఛైర్మెన్ దేవెంధర్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, టి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాథోడ్, ఆర్డీవో ప్రసూనాంభ, నాయకులు పాకాల రాంచందర్, వెంకట్‌రాంరెడ్డి, కౌన్సిలర్లు భూపతిరెడ్డి, సుధాకర్, కోటగిరి అశోక్, మేడారం ప్రదీప్‌లతోపాటు గొల్లకుర్మ,యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్