తెలంగాణ

తెరాస పాలనలోనే రైతులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నకోడూరు, సెప్టెంబర్ 24: గత ప్రభుత్వాల హయాంలో రైతులకు విద్యుత్ అందించకుండా రోడ్డుపాలు చేశారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్‌లో 33కెవి సబ్‌స్టేషన్, అంగన్‌వాడీ, సిసి రోడ్ల శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు 24గంటల విద్యుత్, ఎరు వులు, విత్తనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడ్డారన్నారు. స్వరాష్ట్రం ఏర్పాడ్డాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ప్రతి గ్రామాన్ని అదర్శంగా తీర్చి దిద్దడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేశామన్నారు. అంతకు ముందు రామునిపట్లలో దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాణిక్యరెడ్డి, జడ్పీటిసి సభ్యురా లు కమల, ఎఎంసి చైర్మన్ వెంకట్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాపయ్య, బాల్‌రెడ్డి, నాయకులు రాధకిషన్‌శర్మ, రాంచంద్రం, సర్పంచ్‌లు లావణ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అనంతసాగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు