తెలంగాణ

నీళ్లిచ్చి తీరాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16:నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి మిగిలి ఉన్న కొద్దిపాటి పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్‌లో సాగునీటిని ఇచ్చి తీరాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులవారీగా ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. గతంలో ప్రకటించిన విధంగా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పారు. నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పనులు జూన్ నాటికి పూర్తి కావాలని, ఏవో కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవద్దని అన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా లక్షా 50వేల ఎకరాలకు, నెట్టెంపాడు ద్వారా లక్షా 50వేల ఎకరాలకు, బీమా ద్వారా లక్షా 40వేల ఎకరాలకు, కోయిల్ సాగర్ ద్వారా 20 వేల ఎకరాలకు, మొత్తం నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఈలక్ష్యాన్ని సాధించి తీరాల్సిందేనని, దానికి తగిన విధంగా పని చేయాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కొరత లేదని, కాంట్రాక్టర్లకు పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించేందుకు అధికారులకు తమ కేంద్రాల్లోనే ఉండాలని అన్నారు. హెడ్ క్వార్టర్‌లో కాకుండా హైదరాబాద్‌లో ఉండి జిల్లాలలకు వెళుతున్న వారికి హెచ్‌ఆర్‌ఏ కోత విధిస్తామని చెప్పారు. జిల్లాల్లోనే ఉండాలని అన్నారు. ఈ రెండు నెలలు అతి కీలకమని అన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి , ఒఎస్‌డి దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.