తెలంగాణ

వైస్ చైర్మన్‌గా ఖాజా అత్తర్‌పటేల్‌లు ఏకగ్రీవ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 16 : మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌గా కడవేర్గు రాజనర్సు, వైస్ చైర్మన్‌గా ఖాజా అత్తర్‌పటేల్ ఎన్నికయ్యారు. రాజనర్సు మున్సిపల్ చైర్మన్‌గా రెండవ సారి ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా, జడ్పీ సిఇఓ వర్షిణి వ్యవహరించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, వివిధ పార్టీలకు చెందిన నూతన కౌన్సిలర్లు హజరయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా దినకర్‌బాబు వ్యహరించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే మున్సిపాల్టీకి కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రిసైడింగ్ అధికారి వర్షిణి ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. కడవేర్గు రాజనర్సు పేరును సీనియర్ కౌన్సిలర్ పల్లె వెంకట్‌గౌడ్ ప్రతిపాదించగా, 10వ వార్డుకు చెందిన మచ్చ వేణుగోపాల్‌రెడ్డి బలపర్చారు. చైర్మన్ పదవి కోసం ఒకే నామినేషన్ రావటంతో రాజనర్సు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వర్షిణి ప్రకటించగానే, కౌన్సిలర్లు కరతాళ ధ్వనులతో ఆమోదించారు. రాజనర్సుకు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందచేశారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా 10వ వార్డు కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి ఖాజాఅత్తర్ పటేల్ పేరును ప్రతిపాదించగా, 32వ వార్డు కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ బలపర్చారు. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఒకే నామినేషన్ రావటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వర్షిణి ప్రకటించారు. ఆనంతరం వైస్ చైర్మన్ ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.