తెలంగాణ

తాత్సారం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఏప్రిల్ 16 : పోలవరం ముంపు భూముల వ్యవహారంలో తెలంగాణ సిఎం కెసిఅర్, ఎపి సిఎం చంద్రబాబు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు. 16 వందల టిఎంసి గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుండగా వాటిని తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం అంశంపై దృష్టి సారించాలని సూచించారు.
ముఖ్యంగా తెలంగాణకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకుంటేనే భవిష్యత్‌లో సాగునీటికి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు. అయితే ఎపికి దక్కాల్సిన నీటిని ఎలాగూ అడ్డుకునే అవకాశం ఉండదని, దీనిని దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఅర్ రాష్ట్ర వ్యవసాయరంగానికి ప్రయోజనం జరిగేలా చర్యలు చేపడితే తమ సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర విభజన సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలం పరిధిలోని 7 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళగా, ఆ గ్రామాలు తెలంగాణ పరిధిలో ఉంటేనే న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు ప్రధానమంత్రిని కలవనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులకు ప్రధాన మంత్రి సంచాయ్ యోజన పథకం ద్వారా నిధులు కేటాయించేందుకు దృష్టి సారించగా నదులు, ప్రాజెక్ట్‌లు వీటికి అనుసంధానంతోనే సాగునీరు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలతోపాటూ రైతు సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని, రైతు ఆత్మహత్యల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.