తెలంగాణ

నిప్పుల కుంపటి ఆదిలాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 16: ఆదిలాబాద్ జిల్లాలో నిప్పుల కుంపటి రాజేస్తోంది. పదేళ్ల రికార్డును తిరగరాసి ఏప్రిల్ మాసంలో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
గత పదేళ్ల కిందట ఏప్రిల్ చివరి వారంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా శనివారం ఈ రికార్డు బద్దలైంది. ఎండ తీవ్రతకు తోడు తీక్షణమైన వడగాలులకు జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. శనివారం పగటి ఉష్ణోగ్రత 44.6 డిగ్రీలు నమోదు కాగా భీకరమైన వడగాలులకు రెబ్బెన మండల కేంద్రంలో నర్సయ్య (48) అనే ఉపాధ్యాయుడు, దండేపల్లి మండలం మామిడిగూడలో దుమాళ్ళ దుబ్బరాజు (67) అనే వృద్ధురాలు మృతి చెందారు. ఉదయం 7 గంటలకే పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదు కాగా మిట్ట మధ్యాహ్నం 44.6 డిగ్రీలు రికార్డు కావడంతో ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండాన్ని తలపించింది. భరించలేని వడగాల్పులకు పిల్లలు, వృద్ధులు, మహిళలు తల్లడిల్లిపోయారు. మరోవైపు మంచిర్యాల ప్రాంతంలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ కోల్‌బెల్ట్ ప్రాంతాలు నిప్పుల కుంపటిగా మారడంతో సాధారణ కుటుంబాలు అల్లాడిపోయాయి. తునికాకు సేకరణ సీజన్ ప్రారంభం కావడంతోనే ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలు అడవుల్లో తునికాకు సేకరణకు వెళ్లి అల్లాడిపోయారు. జిల్లాలో వేసవి ఎండలు ముదురుతుండడంతో ఉపాధి హామీ పనులకు తీవ్ర ప్రతిబంధకంగా మారాయి. వ్యవసాయ పనులు, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోగా జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ పట్టణాలు సాయంత్రం 6 గంటల వరకు జనసంచారం లేక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సామాన్య జనం ఇంటి గడప దాటి బయటకు వెళ్లలేకపోయారు. మరో మూడు రోజుల పాటు జిల్లాలో ఎండ తీవ్రత ఇదేవిధంగా ఉంటుందని, వడగాలుల ప్రభావం కూడా జోరుగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.