తెలంగాణ

వడదెబ్బతో 11మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/ఆదిలాబాద్/మహబూబ్‌నగర్/కరీంనగర్/వరంగల్, ఏప్రిల్ 16: ఎండల తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం వడదెబ్బతో 11 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన దుండిగల పెదరాములమ్మ (70) అనే వృద్ధురాలు, నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన తల్వార్ కన్నాంబ (75) అనే వృద్ధురాలు, ఆత్మకూర్(ఎస్) మండలంలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన బొజ్జెంకి గంగయ్యచారి (70) అనే వృద్ధుడు, వలిగొండ మండలంలోని మాందాపురం గ్రామానికి చెందిన బల్లెపు సాయిలు (75) అనే వృద్ధుడు, అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి చెందిన మండల్‌రెడ్డి రణదీర్‌రెడ్డి (35), మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని బుసిరెడ్డికి చెందిన రాజు (40) అనే వ్యవసాయ రైతు, ధరూరు మండల కేంద్రంలోని ముస్లిం కాలనీకి చెందిన అన్వర్ (50), ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో నర్సయ్య (48) అనే ఉపాధ్యాయుడు, దండేపల్లి మండలం మామిడిగూడలో దుమాళ్ళ దుబ్బరాజు (67) అనే వృద్ధురాలు, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామానికి చెందిన పొతుగంటి కనుకవ్వ (55) అనే వ్యవసాయ కూలీ, వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన వృద్ధురాలు కొయ్యడ లక్ష్మి (70) అనే వృద్ధురాలు మృతి చెందారు.