తెలంగాణ

క్యాట్ ఫిష్ పెంపకాన్ని నిలిపివేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా మండలాల్లో క్యాట్ ఫిష్ పెంపకం సాగుతోందని, దీనిని నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందంటూ ఆ జిల్లాకు చెందిన ఎంపిటీసీలు రాధా కృష్ణారెడ్డి, రాఘవేందర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తుంగభద్ర, జూరాల, శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద క్యాట్ ఫిష్ పెంపకాన్ని నిషేధించినా, అనేక మంది ప్రైవేట్ వ్యక్తులు క్యాట్ ఫిష్ చెరువులు ఏర్పాటు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. క్యాట్ ఫిష్ పెంపకం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని, ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. రెండువేల ఎకరాల్లో ఈ ఫిష్‌ను పెంచుతున్నారన్నారు. ఈ చేపల పెంపకాన్ని 1997లోనే కేంద్రం నిషేధించిందన్నారు.