తెలంగాణ

నిజాం నగలొస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18:పురాతనమైన, అతి విలువైన నిజాం నగలు ఎట్టకేలకు హైదరాబాద్‌కు శాశ్వతంగా తరలిరానున్నాయి. ఉమ్మడి ప్రభుత్వంలోనే ఈ నగలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. అవి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. రాష్ట్రానికి నిజాం నగలు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే అత్యంత విలువైన ఆ నగల భద్రత విషయంలో సంతృప్తి చెందిన తరువాతనే నగలను హైదరాబాద్‌కు తరలిస్తారు. నిజాం నగలు ప్రస్తుతం ముంబయిలోని ఆర్‌బిఐ అధీనంలో నగలు భద్రంగా ఉన్నాయి. బరువును బట్టి చూస్తే నగల విలువ నాలుగు వందల కోట్లరూపాయలు. అయితే పురాతనమైనవి కాబట్టి వాటి విలువ లెక్కకట్టలేని స్థాయిలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వేలంలో వాటి విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని, ఇంతటి విలువైన పురాతన సంపద భద్రత విషయంలో తీసుకోవలసిన చర్యల వల్ల నగల్ని హైదరాబాద్‌కు తెప్పించడంలో ఆలస్యం అవుతోంది. హైదరాబాద్‌లో ఉన్న సాలార్‌జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్‌లోని స్టేట్ మ్యూజియంలను గతంలో పరిశీలించారు. నిజాం నగలు భద్రంగా ఉంచడానికి ఇవి అనుకూలంగా లేవని భావించారు. ఈ భవనాలకు అనుబంధంగా పటిష్ఠమైన భద్రతతో మరో భవనం నిర్మించడం లేదా నగరంలో మరో కొత్త భవనం నిర్మించి నగలను అక్కడ ఉంచడం వంటి విషయాలను పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందున వీలును బట్టి నిజాం నగలను హైదరాబాద్‌కు తీసుకు రానున్నట్టు అధికారులు తెలిపారు. నిజాం నగలతో మ్యూజియం ఏర్పాటు చేస్తే తెలంగాణ పురాతన సంపదను ప్రదర్శించే అవకాశం ఉంటుందనీ, అదేవిధంగా టూరిజం అభివృద్ధికీ దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. నిజాం నగలను మూడేళ్ల క్రితం ముంబయిలో, కొద్ది రోజులపాటు హైదరాబాద్‌లో ప్రదర్శిస్తే సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిజాం నగలను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన పక్షంలో వాటి ప్రదర్శనను కూడా భారీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.