తెలంగాణ

సిబిఐ దర్యాప్తుకు ఆదేశించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఆ సొసైటీ ఉపాధ్యక్షుడు జె రవీందరెడ్డి, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సొసైటీలో దాదాపు రూ. 419 కోట్ల మేర దుర్వినియోగం జరిగిందని వారు పిటిషన్‌లో ఆరోపించారు. సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీ విచారణ జరిపి అనేక అవకతవకలు జరిగినట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా ఉన్న కె స్వామిగౌడ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ అవకతవకలు జరిగాయని, ఈ అభియోగాలపై క్రిమినల్ కేసు కూడా నమోదైందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.