తెలంగాణ

జూపల్లి ‘జూ’లో ఉన్న పిల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ‘జూ’లో ఉన్న పిల్లిలాంటి వాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. మంత్రి జూపల్లికి తనను విమర్శించే స్థాయి లేదని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పందిస్తే దానికి తాను సమాధానం చెబుతానని ఆమె శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు నీరుఅ దించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరిట ముఖ్యమంత్రి బంధువులు, అనుయాయులు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఈ అవినీతిని తాము అడ్డుకుని తీరుతామని ఆమె తెలిపారు. గతంలో రెండు సార్లు ప్రాజెక్టు సర్వే కోసం నిధులు విడుదల చేశారని ఆమె చెప్పారు. ఇప్పుడు పంట కాలువలు, ఇతర పనుల సర్వే కోసం ప్రభుత్వం 88 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిందని, ఈ టెండర్లలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా, అర్హత లేని వారికి కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆమె విమర్శించారు.

చిత్రం విలేఖరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి డికె అరుణ