తెలంగాణ

రెండేళ్ల తర్వాత కళ్లు తెరిచిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి, వలసలు నివారించడానికి ఆ పార్టీ అధిష్టానం రెండేళ్ళ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ నిద్రాణమైన పరిస్థితుల్లో ఉందని భావించిన అధిష్టానం శనివారం జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది. రాష్ట్ర విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షునిగా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు నియమించిన కార్యవర్గమే ఇప్పటి వరకూ కొనసాగింది. అయితే కేవలం అధ్యక్షులే మారారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు అనివార్యం కావడంతో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను నియమించిన సంగతి తెలిసిందే. అయితే పొన్నాల లక్ష్మయ్యను పార్టీ అధిష్టానం తప్పించి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టివిక్రమార్కను నియమించింది. కాగా ఈ రెండు సంవత్సరాల కాలంలో అధ్యక్షులు మారారు తప్ప కార్యవర్గం నియమాకానికి నోచుకోలేదు. తాజాగా పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి పెట్టి పలు దఫాలుగా పార్టీ సీనియర్ నాయకులను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీని ఇలా మరికొంత మంది నాయకులను వేర్వేరుగా పిలిపించుకుని చర్చించి, చివరకు శనివారం కార్యవర్గాన్ని ప్రకటించింది.
కార్యవర్గాన్ని నిశితంగా పరిశీలిస్తే పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్న వారికీ చోటు కల్పించారు. పార్టీకి ఎవరూ దూరం కాకుండా ఉండేందుకు, పార్టీలో జవసత్వాలు నింపి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు పార్టీ నాయకత్వం కృషి చేసినట్లు కనిపిస్తున్నది. అందుకే ఎక్కువ మందికి చోటు కల్పించారు. ఉదాహరణకు లోగడ పార్టీ సమన్వయ సంఘం సభ్యులుగా 8 మంది ఉండగా, ఈ దఫా ఏకంగా 31 మందిని ప్రకటించింది. ఉపాధ్యక్షులను 13 మందిని నియమించగా, ప్రధాన కార్యదర్శులను భారీగానే 31 మందిని నియమించారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా 35 మందిని నియమించారు. టి.పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ సమన్వయ సంఘంతో పాటు పార్టీ ఎగ్జికూటివ్ కమిటీ సభ్యునిగా కూడా నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్‌సిసి) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దానం నాగేందర్‌ను కూడా సమన్వయ కమిటీ సభ్యునిగా నియమించారు.
పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నిస్తేజంగా ఉంటున్న వారికి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌కు రాకుండా ఉంటున్న వారందరినీ ఏరికోరి కార్యవర్గంలో స్థానం కల్పించారు.
ఆ జాబితాలో కొన్ని పేర్లు చూసిన నేతలకు ఫలానా నాయకుడు మన పార్టీలోనే ఉన్నారా?, ఎప్పుడో టిఆర్‌ఎస్‌లో చేరి పోయారనుకున్నానని ఛలోక్తులూ వేసుకోవడం కనిపించింది. టిఆర్‌ఎస్‌లో చేరకుండా పార్టీ నాయకులను కాపాడుకోవడానికి ఏదో ఒక రకంగా పార్టీ కార్యవర్గంలో స్థానం కల్పించి, ఎఐసిసి తమను గుర్తించిందని చెప్పుకునేలా చేయడం గమనార్హం.