తెలంగాణ

జనగామ కలెక్టర్ పై పాలనాపరమైన చర్యలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, అక్టోబర్ 11: జనగామ జిల్లా కలెక్టర్ దేవసేనపై పాలనాపరమైన చర్యలు తీసుకోవటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు పాలనాపరమైన విషయాలు మాట్లాడే సందర్భంలో నిబంధనలకు లోబడి ఆచితూచి వ్యవహరిచవలసి ఉండగా, ఇటీవల జనగామ పట్టణంలో బతుకమ్మకుంట (్ధర్మోనికుంట) వ్యవహారంలో ఏర్పడిన వివాదంపై కలెక్టర్ దేవసేన పాలనాపరమైన నిబంధనలకు విరుద్ధంగా మీడియా ముందు బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వవర్గాలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. బతుకమ్మకుంట స్థలం ఆక్రమణ వ్యవహారంపై కలెక్టర్ దేవసేన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్ దేవసేనపై ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌కు ఫిర్యాదు కూడా చేసారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినా, కలెక్టర్ దేవసేన మీడియా ముందు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టినట్లు సమాచారం. బహిరంగ వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తడానికి కలెక్టర్ అవకాశం కల్పించారని సిఎం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బుధవారం వరంగల్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై వచ్చిన ఆరోపణల గురించి విలేఖరులు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ప్రశ్నించగా ముత్తిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు, కలెక్టర్‌పై ముత్తిరెడ్డి చేసిన ఫిర్యాదును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ విచారిస్తున్నారని చెప్పారు.
ప్రజాప్రతినిధులు కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటించాలని, ఇదే నిబంధనలు అధికారులు కూడా వర్తిస్తాయని చెప్పారు. ఏ విషయం మాట్లాడాలో, ఏ విషయం మాట్లాడకూడదనే విషయాలపై అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా వ్యవహరించవలసి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రి ఇచ్చిన ఈ సమాధానం కూడా కలెక్టర్‌పై పాలనాపరమైన చర్యలకు అవకాశం ఉందనే అభిప్రాయానికి మరింత బలం చేకూరుస్తోంది.

ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఇంటిలో
ఎసిబి సోదాలు
రామడుగు, అక్టోబర్ 11: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం గోపాలరావుపేటలో బుధవారం అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. ఎసిబి డిఎస్పీ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఉద యం 6 గంటలకు రెండు వాహనాల్లో గ్రామానికి చేరుకున్న అధికారులు రెండు టీములుగా విడిపోయారు. ఇందులో శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో ఒక టీం, ఆయన మామ నోముల భాస్కర్ రెడ్డి ఇంటి లో మరో టీం సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా డిఎస్పీ సుదర్శన్ గౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ సోదాల్లో తమకు ఎలాంటి పత్రాలు లభించలేదన్నారు. గ్రామంలో ఎసిబి సోదాలు నిర్వహించడంతో చర్చనీయాంశంగా మారింది.
ఉపాధి పథకంలో అక్రమాలు
కేసముద్రం, అక్టోబర్ 11: మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఉపాధి హామీ పనులపై ఇటీవల నిర్వహించిన ప్రజావేదిక తనిఖీలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే విషయం బయటపడింది. దీనితో రంగాపురం, కేసముద్రం (వి), మహమూద్‌పట్నం గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ రామును విధు ల నుంచి సస్పెండ్ చేస్తూ డిఆర్‌డిఎ పిడి వైవి గణేష్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎంపిడిఓ అరుణాదేవి బుధవారం తెలిపారు. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పలు గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
షోకాజ్ నోటీసులు అందుకున్నవారిలో కేసముద్రం (స్టే), దన్నసరి, అమీనాపురం, అన్నారం, అర్పనపల్లి, బేరువాడ, కోమటిపల్లి, కోర్కోండపల్లి, ఇనుగుర్తి, వెంకటగిరి, ఉప్పరపల్లి, కలువల, పెనుగొండ, కాట్రపల్లి, తాళ్లపూసపల్లి గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు టిఎ నర్సింహా, కంప్యూటర్ ఆపరేటర్లు సుస్మిత, చిరంజీవి ఉన్నారు. కాగా, మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని సామాజిక తనిఖీలో నిర్ధారించిన అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లకు 200 నుంచి 2వేల వరకు జరిమానా విధించినట్లు ఎంపిడిఓ తెలిపారు.