తెలంగాణ

వర్షాల కారణంగా పంటలకు లాభమా? నష్టమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటల పరిస్థితిపై నివేదిక పంపించాలంటూ జిల్లా అధికారులకు వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పంటలతో పాటు ప్రాణాలకు ఏదైనా హానీ జరిగిందా? ఇతరత్రా ఏమైనా నష్టం జరిగిందా? అన్న అంశాలపై నివేదికలను పంపించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు తహశీల్దారులు, గ్రామ రెవెన్యూ అధికారులనుండి నివేదికలను తెప్పిస్తున్నారు. గ్రామస్థాయి నుండి మండలస్థాయికి, మండలస్థాయి నుండి జిల్లాస్థాయికి వచ్చే నివేదికలను క్రోడీకరించి జిల్లాస్థాయిలో ఒక సమగ్ర నివేదికను రూపొందించడంలో కలెక్టర్లు నిమగ్నమయ్యారు. అలాగే పంటలకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారులు మండల కేందాల్లోని వ్యవసాయ అధికారులకు, గ్రామాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు సమాచారం అందించారు. పంటల పరిస్థితిపై వాస్తవాలను సేకరించి తమకు పంపించాలంటూ జిల్లా వ్యవసాయ అధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్‌లో వేసిన పంటలు ఇప్పుడిప్పుడే రైతుల చేతికి వస్తున్నాయి. జూన్ రెండోవారంలో రాష్ట్రంలో వర్షాలు కురవడం ప్రారంభమైంది. జూన్-జూలై మధ్యకాలంలో వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వాస్తవంగా నైరుతీ రుతుపవనాల ప్రభావం జూన్ నుండి సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ సంవత్సరం జూన్‌లో వారంరోజుల ఆలస్యంగా ప్రారంభమైన రుతుపవనాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అక్టోబర్ మధ్యవరకు ఇవి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో తుపాను ద్రోణి ఏర్పడటం, మధ్యభారతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటం తదితర కారణాల వల్ల తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 2017 అక్టోబర్ ప్రారంభం నుండి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల పంటలకు లాభం జరిగిందా? నష్టం జరిగిందా? తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వ కోరింది. జిల్లాల నుండి నివేదికలు వచ్చిన తర్వాత ఏం చేయాలన్న అంశంపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు బుధవారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.