తెలంగాణ

ఎస్‌ఐల భర్తీ ప్రక్రియ ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: సబ్ ఇన్‌స్పెక్టర్ల ఉద్యోగాల నియమాక ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు తెలంగాణ రాష్టస్థ్రాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌సిసి- సి కోటాను నియమాకాల్లో సరిగ్గా అమలు చేయలేదని ఎం రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖర్ రెడ్డి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌సిసి సి కోటాను ప్రత్యేక కేటగిరిగా భావించి సరిగ్గా అమలు చేయకుండా ఫలితాలు ప్రకటించడం అన్యాయమని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేసి, అనంతరం కేసును సోమవారానికి వాయిదా వేసింది. ఇటీవలే ఎస్‌ఐ ఉద్యోగాల ఫలితాలను బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.