తెలంగాణ

12వేల కోట్లతో కొత్త పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట వద్ద 400 కెవి సబ్‌స్టేషన్ నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు భవిష్యత్ డిమాండ్‌కు సరిపడ విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు రచించుకుంటూ, నిర్థిష్టకాలంలో అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.1600 కోట్లతో సూర్యాపేట వద్ద నిర్మించిన 400 కెవి సబ్ స్టేషన్‌ను సిఎం కెసిఆర్ గురువారం ప్రారంభించనున్నారు. విద్యుత్ పంపిణీ, సరఫరాపై బుధవారం ఉదయం ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు సిఎంకు నివేదిక అందజేసారు. రూ.12,610 కోట్ల వ్యయంతో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం చేపట్టిన పనులను కెసిఆర్‌కు వివరించారు. రాష్ట్రం ఆవిర్భవించిన ఐదో నెల నుంచే రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పరిశ్రమల అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే వ్యవసాయానికి ప్రస్తుతం పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా అవుతుంది. వ్యవసాయానికీ 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని గత ఏడాదే సిఎం కెసిఆర్ ట్రాన్స్‌కోను ఆదేశించారు. దీంతో 24 గంటల విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌కో, జెన్‌కో ఏర్పాట్లు చేశాయ. రాష్ట్రం ఏర్పడక ముందు వరకు (2014, జూన్ 2) రాష్ట్రంలో 5,240 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఆరు 400 కెవి సబ్ స్టేషన్లు ఉండేవి. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించడానికి రూ.13 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన 400 కెవి సబ్ స్టేషన్లు 9 అవసరం అవుతాయని అంచనా వేసింది. ఈ మేరకు సూర్యాపేట, నర్సాపూర్, అసుపాక, డిండి, మహేశ్వరంలో 3980 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు 400 కెవి సబ్ స్టేషన్లను పూర్తి చేసింది. మిగిలిన నాలుగు 400 కెవి సబ్ స్టేషన్లను జూలూరుపాడ్, నిర్మల్, కేతిరెడ్డిపల్లి, జనగామలో పురోగతిలో ఉన్నాయి. మొదటి దశలో పూర్తి అయిన సూర్యాపేట వద్ద నిర్మించిన 400 కెవి సబ్ స్టేషన్‌ను గురువారం సిఎం కెసిఆర్ ప్రారంభిస్తున్నారు. భవిష్యత్‌లో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 220 కెవి సబ్ స్టేషన్లు 19, 132 కెవి సబ్ స్టేషన్లు 35 పూర్తి చేసింది. దీంతో రాష్ట్రావిర్భావానికి ముందు 233 ఇహెచ్‌టి లైన్ల సామర్థ్యం కలిగి ఉండగా, ప్రస్తుతం ఇది 292 సబ్‌అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రం ఏర్పడక ముందు 16,379 కిలోమీటర్ల విద్యుత్ లైన్ ఉండగా ప్రస్తుతం ఇది 19,916 కిలోమీటర్లకు చేరుకుంది. ఇవ్వేకాకుండా 33/11 కెవి లైన్లు కూడా 15 వేల కిలోమీటర్లను కొత్తగ వేసినట్టు ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు సిఎం కెసిఆర్‌కు వివరించారు.