తెలంగాణ

ఏసీబీ వలలో ఎక్సైజ్ చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్/ రామడుగు, అక్టోబర్ 11: ఏసీబీ వలలో ఎక్సైజ్ చేప చిక్కింది. డిస్టిలరీస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ దాడులు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై శ్రీనివాస్ ఇంటితోపాటు, బంధువుల ఇళ్లలోనూ ఏసిబి అధికారులు సోదాలు నిర్వ హించారు. బుధవారం ఉదయం నుంచి ఓల్డ్‌బోయిన్‌పల్లి రామరాజుకాలనీలోని నివాసంలో ఏసీబీ డిఎస్పీ సునీత, రవికుమార్ ఆధ్వర్యంలో 10మంది సభ్యుల బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో విలువైన ధ్రువపత్రాలు, నగదు, బంగారు నగలు, బ్యాంక్ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్‌లోని ఆయన సోదరుడి ఇంటితోపాటు రాష్టవ్య్రాప్తంగా పదిచోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. 15 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు మూడు ఇళ్లు, నాలుగు ఇళ్ల స్థలాలు కనుగొన్నారు. మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లాలోని పేట్ బషీరాబాద్‌లో రూ. 7.15 లక్షలు విలువచేసే 476 గజాల ప్లాట్, 35.76 లక్షలు విలువచేసే జి+4 ఇండిపెండెంట్ హౌజ్, రామరాజునగర్‌లో రూ. 25 లక్షలు విలువచేసే ఒక ఫ్లాట్, హస్మత్‌పేట్‌లో రూ. 22 లక్షలు విలువచేసే 220 గజాల ఇంటి స్థలం, జీడిమెట్లలో రూ. 7.11 లక్షలు విలువచేసే 474 గజాల ఇంటి స్థలం, ఆయన మామపేరిట రూ. 1.04 లక్షలు విలువచేసే 68 గజాల ఇంటి ప్లాటు, మెదక్ జిల్లా గజ్వేల్‌లో 5.20 లక్షలు విలువచేసే మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి, కరీంనగర్‌లో రూ. 4 లక్షలు విలువచేసే మామిడి తోట, రూ. 8 లక్షలు విలువచేసే మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, రూ. 17.50 లక్షలు విలువచేసే బంగారు నగలు, రూ. 5.88 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్, రూ. 3.3 లక్షలు ఇన్సూరెన్స్ చెల్లింపులు, రూ. 2.50 లక్షలు విలువచేసే గృహోపకరణ వస్తువులు ఉన్నట్టు కనుగొన్నారు. శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి ఏసిబి కోర్టులో హాజరుపరచినట్టు ఏసిబి డైరెక్టర్ జనరల్ తెలిపారు.
స్వగ్రామంలో..
స్వగ్రామం గోపాలరావుపేటలోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. డిఎస్పీ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు రెండు వాహనాల్లో గ్రామానికి చేరుకున్న అధికారులు రెండు టీములుగా సోదాలు నిర్వహించారు. డిఎస్పీ సుదర్శన్ గౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ సోదాల్లో తమకు ఎలాంటి పత్రాలు లభించలేదన్నారు. గ్రామంలో ఏసిబి సోదాలు నిర్వహించడంతో చర్చనీయాంశంగా మారింది.