తెలంగాణ

పోలీస్ క్యాంటీన్ అధికారులకు జిఎస్‌టిపై అవగాహన సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ రాష్ట్ర సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఆఫీసర్స్, క్యాంటీన్ ఇన్‌చార్జిలతో ఐజి (వెల్ఫేర్) సౌమ్యమిశ్రా సమావేశమయ్యారు. బుధవారం డిజిపి కార్యాలయ సమావేశ మందిరంలో జిఎస్‌టిపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, పోలీస్ క్యాంటీన్‌లు జిఎస్‌టిని అమలుచేయడం లేదని, జిఎస్‌టిపై అవగాహన పెంచుకుని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో సుమారు 50 మంది పోలీస్ క్యాంటీన్ ఇన్‌చార్జిలతోపాటు, డిసిపి టి శ్రీనివాస్, ఏ అశోక్, డి సత్యనారాయణ, కమర్షియల్ డిపార్టుమెంట్ అధికారులు, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వై గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నకిలీ ఆయుర్వేద మందుల ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్, అక్టోబర్ 11: నకిలీ ఆయుర్వేద చికిత్స పేరుతో ఆయుర్వేద మందులు విక్రయిస్తున్న ముఠా గుట్టును నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్‌లో ఆయుర్వేద చికిత్సలు చేస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్న 19 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,01,000లు విలువచేసే నకిలీ మందులు, 11బైక్‌లు,ర సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకలోని బెల్గం జిల్లా గోకక్ గ్రామం కేంద్రంగా వ్యాపారం సాగుతున్నట్టు పోలీసులు కనుగొన్నారు. 19 మంది నిందితులు 4 ముఠాలుగా ఏర్పడి ఒక్కో గ్రామంలో 20 రోజులపాటు తిష్టవేసి ఆయుర్వేద చికిత్స పేరుతో నకిలీ మందులు విక్రయిస్తున్నారు. బెల్గం జిల్లాకు చెందిన రాజు హువప్ప శెట్టి, ఆనంద్ గోవిందప్ప, సురేష్ దుర్గప్ప, ఒప్పా దుర్గప్ప శాస్ర్తీ ముఠా సభ్యులుగా వ్యవహరిస్తున్నారని టాస్క్ఫోర్స్ అదనపు డిసిపి సి శశిధర్‌రాజు తెలిపారు. నలుగురు ముఠా నాయకులు సహ 19 మందిని అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్, సుల్తాన్‌బజార్, అంబర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు అప్పగించినట్టు శశిధర్‌రాజు తెలిపారు.