తెలంగాణ

స్కూల్ ఫీజులపై అసెంబ్లీలో చర్చించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ తదితర విషయాలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేయాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ప్రభుత్వానికి, విపక్షానికీ కోరింది. ఫీజుల నియంత్రణ విధివిధానాల తయారీ కోసం ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ టి తిరుపతిరావు కమిటీకి ప్రైవేటు స్కూళ్లు సహకరించకపోవడంతో ఆరు నెలలు గడచినా తుది నివేదిక ఇవ్వలేకపోయిందని సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, ప్రధానకార్యదర్శి ధనసిరి ప్రకాశ్‌లు పేర్కొన్నారు. కమిటీ కోరిన 2015-16, 2016-17 సంవత్సరాల ఆదాయ వ్యయ వివరాలను , 2017-18కి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను అందజేయమని కోరితే 10,799 స్కూళ్లకు గానూ కేవలం 131 స్కూళ్లు మాత్రమే అందజేశాయి. ఇక మీద తాము ఆదాయ వ్యయ వివరాలను ఇచ్చేది లేదని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తేల్చి చెప్పాయని, అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో ప్రైవేటు స్కూళ్ల ఫీజులు అత్యధికంగా నాలుగు లక్షల రూపాయిల వరకూ ఉందని పేర్కొన్నారు. ఒకే మేనేజిమెంట్ నుండి ఫ్రాంచైజ్‌లను తీసుకుని నడుపుతున్న పాఠశాలల్లో కూడా ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఫీజులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. 2015-16 సంవత్సరానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటో తరగతికి కొల్‌కటాలో 39,050 రూపాయిలు, బెంగలూరులో 41,100, ముంబైలో 62,330, ఢిల్లీలో 86,400 రూపాయిలు ఉండగా హైదరాబాద్‌లో 1,49,000 వసూలు చేశారని అన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ ఫీజులు కంటే ఎల్‌కెజి ఫీజులు ఎక్కువగా ఉన్నాయని, ఫీజులు తగ్గించాలని అడిగిన తల్లిదండ్రుల పిల్లల్కు కొన్ని యాజమాన్యాలు టిసిలు ఇచ్చి గెంటేస్తున్నారని అన్నారు. ట్యూషన్ ఫీజుతో పాటు అదనంగా స్మార్టు క్లాసులు, స్పెషల్ క్లాసులు, మీటింగ్‌లు, ఎస్‌ఎంఎస్‌లు మొదలైన పేర్లతో అదనపు ఫీజును గుంజుతున్నారని వారు చెప్పారు. స్కూళ్లలోనే దుకాణాలు తెరచి యూనిఫారాలు, స్టేషనరీ మొదలైనవి మార్కెట్ రేట్ల కంటే మూడు రెట్లు ఎక్కువ ధరతో పెద్ద బిజినెస్ అవుతోందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజులపై నియంత్రణ ఉందని వారు చెప్పారు. 2016 మార్చిలో అసెంబ్లీలో ఒక రోజంతా విద్యారంగంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణకు రెండు నెలల్లో ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 18 నెలలు గడచినా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, ఇప్పటికైనా ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యల పరిష్కారంలో

మజ్దూర్ యూనియన్ విఫలం

హైదరాబాద్, అక్టోబర్ 11: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ విఫలమైందని టిఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ బాబు, కె రాజిరెడ్డి నిశితంగా విమర్శించారు. బుధవారం మఖ్దూం భవన్, మినీహాల్‌లో జరిగిన ఎంప్లారుూస్ యూనియన్ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. టిఎంయూ అటు యాజమాన్యానికి, ఇటు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీలోని కొన్ని విభాగాల మూసివేత పరంపర కొనసాగుతుందన్నారు. కార్మికులపై పనిభారం పెంచుతూ, కార్మికుల నడ్డి విరుస్తున్నారని వారు ఆరోపించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని, ఇప్పుడు కనీసం రాజీవ్ స్వగృహ ఇళ్లను కొనుక్కునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. వేతన సవరణ కమిటీ వేసి రెండు నెలలు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.్ప్ప