తెలంగాణ

నరుూం సొమ్ము ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: గ్యాంగ్‌స్టర్ నరుూం ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రశ్నించారు. నరుూం ఎన్‌కౌంటర్ సమయంలో పలు స్థావరాల్లో చేసిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం దొరికిందని ‘సిట్’ అధికారులు తెలిపారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గుర్తు చేశారు. నరుూం కేసు పెద్ద కుంభకోణం అని లోగడ చెప్పానని, ఈ విషయాన్ని ‘సిట్’ అధికారులకు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కూ ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఆ సొమ్మును కోర్టుకైనా దాఖలు చేసిందా? అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాయ మాటలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. నరుూం కేసు విచారణ పేరిట కొన్ని రోజులు, ఆ తర్వాత మియాపూర్ భూముల కుంభకోణం, కొంత కాలం డ్రగ్స్ ఇలా ఏదో అంశాన్ని తెరపైకి తెచ్చి కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు, బంధువులే ఉన్నారని ఆయన ఆరోపించారు.
రోడ్లు బాగు చేయండి
ఇలాఉండగా మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మీడియాతో మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి పరిథిలోని రోడ్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయమై, చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మారు వేషంలో తిరిగి ప్రజల, వాహనదారుల సమస్యలను తెలుసుకోవాలని ఆయన కోరారు.