హైదరాబాద్

ప్రజల చెంతకు పరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, అక్టోబర్ 11: ప్రజల ముంగిట పరిపాలన అందించాలనే ధృడ సంకల్పంతో శామీర్‌పేట మండలంలోనే మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ భవనాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తూంకుంట గ్రామ పంచాయితీ పరిధిలోని అంతాయిపల్లి సర్వేనెంబర్ 87లో కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా ప్రధాన కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాస గృహ నిర్మాణాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. నగరానికి అతి చేరువలో ఉన్న శామీర్‌పేటకు మహార్థశ వచ్చిందని అభివృద్ధికి నోచుకోక ఎన్నో సంవత్సరాలు వెనకబడిన ఈ మండలంలోనే జిల్లా ప్రధాన కార్యాలయాల సముదాయం ఏర్పాటు కావడంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ఈ కార్యాలయాల ఏర్పాటు రానున్న సంవత్సరంలో ఇదే రోజు ప్రారంభించి ప్రజలకు పరిపాలన అందించాలనే సంకల్పంతో నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే అన్ని కుల వృత్తుల వారికి చేయూత ఇచ్చేందుకు గోర్రెలు, చేపలు, ఆవులు తదితర సంపదను ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల వారికి షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలను ఇప్పుడున్న రూ. 50 వేల నుండి 70 వేలకు పెంచి ఆదుకోంటుందని వివరించారు. గత పాలకులు మేడ్చల్‌ను విస్మరించాలని కెసిఆర్ ఆధ్వర్యంలో మేడ్చల్‌ను జిల్లాగా ప్రకటించి జిల్లా ప్రధాన కేంద్రాలను శామీర్‌పేటలో ఏర్పాటు చేయడం కేసిఆర్‌కే సాధ్యపడిందని దీంతో రాష్ట్రంలోనే మేడ్చల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి నంబర్ వన్‌గా అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని అన్నారు.
స్ధానిక రైతుల ఆందోళన
గత కొనే్నళ్ల నుండి ఈ భూమినే నమ్ముకొని జీవనం వెళ్లదీస్తున్న తమకు కలెక్టర్ కార్యాలయ భవనాల నిర్మాణం కోసం తమ భూములను తీసుకోవడం వల్ల తాము నష్టపోతున్నామని కొంత మంది రైతులు ఆందోళన చేశారు. అంతాయిపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 87లో కలెక్టర్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను రైతులు ప్రశ్నించారు. ఇదే గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అందులో ఏర్పాటు చేయకుండా తమకు ఉన్న కొద్ది పాటి భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే తమకు నష్ట వాటిల్లుతుందని ఆ గ్రామానికి చెందిన అలివేలు, మహేందర్, అంజమ్మతో పాటు మరో 50 సభా స్థలి వద్ద తమ గోడును విన్నవించారు.
ప్రోటోకాల్ పాటించని ప్రభుత్వం
కలెక్టర్ కార్యాలయ భవనాకు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎద్దునాగేష్‌కు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా విస్మరించడం సరైంది కాదని తూంకుంట గ్రామ వాసులు ఆరోపించారు. అంతాయిపల్లిలో జరుగుతున్న ప్రభుత్వ కార్యాక్రమానికి స్థానిక సర్పంచ్‌కు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్ని తానే అయినట్లు వ్యవహరించడం సరైందికాదని వారు సూచించారు.
కాంగ్రెస్‌ను విమర్శించ వద్దు
రాష్ట్ర అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఏలాంటి సహకారం అందించలేదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు విమర్శిస్తుండగా సభా వేదికపై ఉన్న జడ్పీటిసి బాలేష్ స్పందిస్తూ తమ పార్టీని విమర్శించ వద్దని ఇదీ కేవలం ప్రభుత్వ కార్యక్రమని రాజకీయం చేయడం సరైంది కాదని అనడంతో ఎమ్మెల్యే కృష్ణారావు సద్దుమణిగి తమ ప్రసంగాన్ని కొనసాగించారు.

తెగిన రాంపూర్ చెరువు
నీటమునిగిన వందలాది ఎకరాలు * భయపెడుతున్న చుక్కాయ చెరువు లీకేజీ
తలకొండపల్లి, అక్టోబర్ 11: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్‌లో సూర్యారావు చెరువు కట్ట మంగళవారం రాత్రి తెగిపోయంది. దీంతో నీరు మొత్తం వెల్జాల్ సహదేవి సముద్రంలోకి చేరుతోంది. రాంపూర్ చెరువు లీకేజీని అరికట్టడానికి రంగారెడ్డి డిఇ మధుసూదన్ రెడ్డి మంగళవారం రాత్రి వరకూ అక్కడే ఉండి మరమ్మతులు చేసినా గ్రామస్థుల నుండి సంపూర్ణ సహకారం లేకపోవడంతో ఏమీ చేయలేకపోయామని ఆవేదనను వ్యక్తం చేశారు. తీరా బుధవారం రింగ్ బాండ్‌తో లీకేజిని అరికట్టాలని ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునే లోపే మంగళవారం రాత్రే సూర్యరావుచెరువుకు గండిపడి నీరంతా వెల్జాల్ చెరువులోకి వెళ్లిందని అన్నారు. ఇప్పటికి 12 కుంటల కట్టలు తెగిపోగా.. మండలంలోని అతి పెద్ద చెరువు అయిన రాంపూర్ చెరువు తెగిపోవడంతో అక్కడి ప్రజలు, రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మండలంలోని మొత్తం చెరువులు నిండినా ఒక వెల్జాల్ చెరువు ఇంకా నిండలేదని అంతా చర్చించుకుంటున్న సమయంలో రాంపూర్ చెరువు తెగి వెల్జాల్ సహదేవి సముద్రంలోకి వరద నీరు వచ్చి చేరడంపై చర్చ జరుగుతోంది. బుధవారం ఉదయం ఎడవల్లి చెరువు కూడా లీకేజీ అవుతోందని సంబంధిత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన నేతలు రంగారెడ్డి ఇరిగేషన్ ఈఈ ఎస్.్భమ్‌ప్రసాద్, డిఈ మధుసూదన్ రెడ్డి, ఎఈ విద్యాసాగర్‌రెడ్డి, రవూఫ్, తలకొండపల్లి ఎంపిడిఓ శ్రీనివాసాచారి వెంటనే చెరువు వద్దకు చేరుకొని మరమ్మతులు చేపట్టారు. వెంటనే లీకేజీకి స్పందించి మరమ్మతులు చేస్తున్నందుకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని అరికట్టడానికి ఒక జెసిబి, సుమారు 400 ఇసుక బస్తాలు, ఒండ్రు మట్టిని, గడ్డిని, ఆరుగు గజ ఈతగాళ్ళను సిద్ధం చేసి లీకేజీని అరికట్టారు.
ఆదేవిధంగా ఇరిగేషన్ అధికారులు బుధవారం ఉదయం మండలంలోని పడకల్, లింగరావుపల్లి, తలకొండపల్లి, చంద్రధన, వెల్జాల్, రాంపూర్ చెరువులపై పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ ఎక్కడైనా చెరువుల లీకేజీ ఉంటే వెంటనే తన దృష్టికి తేవాలని.. చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాంపూర్‌లో తెగిపోయిన చెరువును కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరమ్మతులు చేస్తామని ఈఈ తెలిపారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు రూ. 14వేల కోట్లు
వికారాబాద్ జిల్లాలో ఐటి ప్రాజెక్టుకు హామీ * పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం * జిల్లా ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవంలో రవాణా శాఖ మంత్రి పిఎంఆర్
వికారాబాద్, అక్టోబర్ 11: వికారాబాద్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా వికారాబాద్, పరిగి, తాండూర్ నియోజకవర్గాలకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, త్వరలో టెండర్లు పిలిచే ప్రక్రియలో ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగానే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 14వేల కోట్లు కేటాయస్తోందని చెప్పారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణం పూర్తి కావాలని సిఎం కెసిఆర్ కోట్లాది రూపాయలతో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వికారాబాద్ కలెక్టరేట్ భవనాన్ని 33 ఎకరాల్లో 43 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండి, వనరులున్న జిల్లా అని, ఏ అవకాశం వచ్చినా వికారాబాద్‌కు జిల్లాకు తెచ్చి జిల్లాను 31 జిల్లాల్లో ముందుంచుతామని అన్నారు. ప్రాణహిత నుండి నీటిని తేవడం సాధ్యం కాదని, దానిపైనే సిఎంతో సమావేశం ఏర్పాటు చేయించామని, అన్ని జిల్లాల్లో ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, వికారాబాద్ జిల్లాకు నీరు తెచ్చేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. ఆర్డీవో పరిధిని కలెక్టర్ పరిధిలోకి తెచ్చి, పాలనను సిఎం కెసిఆర్ ప్రజల వద్దకు పెద్దమనసుతో జిల్లాలను ఏర్పాటు చేశారని వివరించారు. అంతే కాకుండా జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళతామని తెలిపారు. జిల్లాకు ఐటి ప్రాజెక్టును ఇస్తామని, మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారని, దీంతో తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలు సైతం అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూర్ మున్సిపల్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా, వికారాబాద్ మున్సిపాలిటీకి నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది కొరతతో ప్రారంభించిన వికారాబాద్ జిల్లాలో ప్రజలకు సేవలందిస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వికారాబాద్ జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపామని జిల్లా కలెక్టర్ డి.దివ్య తెలిపారు. సీజన్ లేని సమయంలో ఉపాధి కూలీలకు పని కల్పించి, కూలీలకు డబ్బులివ్వడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం బూత్ బంగ్లాను తలపించేదని, దీన్ని ఆధునీకరించడంతో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాండూర్ జిల్లా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడమే కాకుండా, కోటి రూపాయలతో ఆధునీకరణ పనులకు కేటాయించగా, మంత్రి మరో 52 లక్షలు మంజూరు చేశారని అన్నారు. తెలంగాణ చిన్న రాష్టమ్రేర్పడితే అభివృద్ధి చెందుతుందని నిరూపించిన సిఎం కెసిఆర్.. అదే ధైర్యంతోనే చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారని చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడు కొండా విశే్వశ్వర్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాకు ఎన్ని అవకాశాలున్నాయో, అన్ని దురదృష్టాలున్నాయని అభిప్రాయపడ్డారు. జిల్లా కేవలం చెరువులకే పరిమితమని, అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రూపొందించారని చెప్పారు. గోదావరి నీరు జిల్లాకు 500 కిలోమీటర్ల దూరంలో ఉండగా, పాలమూరు నీరు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో ప్రాణము, హితమూ రెండూ లేవని వాపోయారు. ప్రాణహితతో 11 స్టేజీలతో నీరు తేవాలంటే కరెంట్ బిల్లు ఎక్కువ ఖర్చు అవుతుందని, కాంట్రాక్టర్లకే లాభం జరుగుతుందని, అది దురదృష్టకరమైన ప్రాజెక్టని అభివర్ణించారు. ప్రజలకు మేలు జరిగే పాలమూరు ప్రాజెక్టు ద్వారానే నీరు తేవాలని అన్నారు. పక్క జిల్లాలో ఉన్న 111 జివో అభివృద్ధికి అడ్డుగా మారిందని, పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. అనంతగిరి టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం టూరిజంలో ఉన్న 35 గదులను 350 నుండి 700 గదుల వరకు పెంచి ఆదాయం వచ్చేలా, ఇక్కడున్న వారికి ఉపాధి లభించేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతగిరిలో పరిశుభ్రతను పాటిస్తే ఆదాయం పెరుగుతుందని చెప్పారు. వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజి అస్తవ్యస్తంగ ఉందని, దీనిపై జిల్లా కలెక్టర్ శ్రద్ద చూపాలని కోరారు. పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ళ ద్వారా జిల్లాకు నీరు వచ్చేలా చూడాలని, పాలమూరు రంగారెడ్డి జిల్లా ద్వారా జిల్లాకు రావాల్సిన 16 టిఎంసిల నీటిలో 10 టిఎంసిలకు తగ్గించి మిగతా నీటిని కెసిఆర్ తన నియోజకవర్గానికి తీసుకెళుతున్నారని ఆరోపించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎస్.కొండల్‌రెడ్డి మాట్లాడుతూ ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న వికారాబాద్‌లోని జిల్లా గ్రంథాలయంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, గ్రూప్ పరీక్షలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు.

నిఘా నీడన ప్రశాంతం
ముప్పు పొంచి ఉంది * మేడిపల్లి ఫార్మాసిటీ ప్రజాభిప్రాయ సేకరణలో విపక్షాల ఆందోళన
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11: ఔషధనగరి ఏర్పాటుతో జరిగే పరిణామాలపై బుధవారం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పోలీసుల నిఘానీడలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాచారం, కందుకూరు, కొత్తూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు పాల్గొని తమ సమస్యలను వినిపించారు. కాలుష్యనియంత్రణ మండలి ప్రతినిధులు రైతుల లేవనెత్తిన సమస్యలను నివృత్తి చేసే యత్నం చేశారు. కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే యత్నం చేశారు.
ఈ ప్రాంతం అభివృద్ధి
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీతో ఈ ప్రాంతం ప్రగతిపథంలో దూసుకుపోనుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసి రైతులను అందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో చేసే అటువంటి ప్రచారాలను విశ్వసించరాదని ఆయన రైతులకు సూచించారు. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతం ఎంతో అభివ ద్ది చెందుతుందని, ముఖ్యమంతి కేసి ఆర్ సారథ్యంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివద్ధి పరుస్తామన్నారు.
ఉపాధి కల్పనే లక్ష్యం
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి రైతులనుద్దేశించి అన్నారు. భూములకు తగిన పరిహారం ఇవ్వడంతోపాటు నిర్వాసిత కుటుంబసభ్యులకు ఉపాధి కల్పించనున్నట్లు అయన తెలిపారు.
ముమ్మాటికీ ముప్పే..
ఫార్మాసిటీతో ఈ ప్రాంత ప్రజలకు ముమ్మాటికీ ముప్పు పొంచి ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డిలు అన్నారు. ఎంతటి అధునాతన టెక్నాలజీ అయినప్పటికీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల కలిగే వాతావరణ కాలుష్యాన్ని అడ్డుకోలేమని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం భూనిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం పెంచాలని వారు డిమాండ్ చేశారు. అసైన్డ్, పట్టా భూముల నిర్వాసితులకు సమాన పరిహారం ఇవ్వాలని అన్నారు.
జెఎసి నాయకుల ముందస్తు అరెస్టు
పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జెఎసి నాయకులు ప్రయత్నిస్తారని పోలీసులు వారిని ఉదయానే్న అరెస్టు చేసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మేడిపల్లిలో సోమవారం సాయంత్రం నుంచి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అడుగడునా వీడియో కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్కా నర్సింహారెడ్డి, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు చిల్క మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, యాచారం జడ్పీటిసి రమేశ్‌గౌడ్, మంచాల, యాచారం మండల పరిషత్ అధ్యక్షులు జయమ్మ, జ్యోతి, వివిధ పార్టీల నాయకులు, పెద్దసంఖ్యలో భూనిర్వాసితులు, అధికారులు, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు.

తుది దశలో
ఓటరు జాబితా సవరణ
* ఇప్పటి వరకు 88 శాతం పూర్తి
* 36లక్షల 45వేల 212 ఓటర్ల తనిఖీ పూర్తి
* సికిందరాబాద్‌లో అత్యధికం..
* బహద్దూర్‌పురాలో అత్యల్పం
* జిల్లా ఎన్నికల అధికారి జనార్దన్ రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: మహానగర ఓటరు జాబితాలోని తప్పోప్పులను సరి చేసేందుకు జిహెచ్‌ఎంసి కొద్ది రోజులుగా చేపట్టిన సవరణ, సమాచార తనిఖీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బుధవారం నాటికి సుమారు 88 శాతం ఓటర్లకు సంబంధించిన సమాచారాన్ని తనిఖీ చేసి, తప్పులను సరిచేసినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. నగరంలో జనాభా కన్నా ఎక్కువ ఓటర్లున్నట్లు ఇదివరకు చేసిన సర్వేలు తేల్చటంతో ఈ సారైనా మహానగరానికి తప్పుల్లేని ఓటరు జాబితాను సిద్దం చేసేందుకు జిహెచ్‌ఎంసి ఈ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా 88 మంది ట్యాబ్ ఆపరేటర్లను నియమించారు. వీరు ఒక్కోక్కరు రోజుకి కనీసం 6900 ఓటర్ల సమాచారాన్ని తనిఖీ చేసి, అందులో తప్పులను సరిచేయాలని లక్ష్యంగా పెట్టారు. ఇంటికి తాళం వేసి ఉంటే, ఈ ఆపరేటర్‌తో పాటు ఉండే బూత్ లెవేల్ ఆఫీసర్లు తన వివరాలతో కూడిన స్టిక్కర్లను అంటించారు. అయితే ఇప్పటి వరకు 36లక్షల 45వేల 212 మంది ఓటర్ల సమాచారం తనిఖీ పూర్తయినట్లు తెలుపుతున్న అధికారులు ఇందులో అత్యధికంగా సవరణ సికిందరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో, అత్యల్పంగా బహద్దూర్‌పురా నియోజకవర్గంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.

బాలికలకు తిరుగు లేదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: అనుకున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు కుటుంబం సహకారాన్ని పొందటంతో పాటు వారి నమ్మకాన్ని వమ్ము చేయనంత వరకు బాలికలకు తిరుగేలేదని సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. తన తండ్రి అండదండలతోనే తాను నేడు ఈ స్థానంలో ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు. బుధవారం నగరంలో జరిగిన అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి ఆమె అతిధిగా హాజరయ్యారు. బాలికల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో..బేటీ పడావో’ కార్యక్రమానికి ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసేందుకు నిర్దేశించిన ఒప్పందంపై ఆమె సంతకం చేశారు. అనంతరం ఆ పత్రాలను మహిళా శిశు అభివృద్ధి శాఖ సెక్రటరీ జగదీశ్వర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ‘చిట్‌చాట్’ ఆమె వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తండ్రి సహకారంతోనే తాను నేడు ఓ సినీ నటిని అయ్యానని, అదే సమయంలో తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ రైఫిల్ షూటింగ్, హాకీ, టెన్నికాయిడ్, కబడ్డీ, ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో చక్కట ప్రావీణ్యం కనబర్చిన విద్యార్థినులకు రకుల్ జ్ఞాపికలను అందజేసి శాలువలతో సన్మానించారు. విద్యార్థులు సినిమా జీవితంపై వేసిన ప్రశ్నలకు ఆమె సమాధానమివ్వటంతో పాటు ‘స్పైడర్’ చిత్రంలోని పాటకు విద్యార్థినిలతో కలిసి కోరస్ పలికి మరింత ఉత్సాహాన్ని నింపారు.
గొంతు విన్పించేందుకు
భయపడొద్దు: ఆర్‌జె షేహాజీ
ఆడ పిల్లలు గొంతు విన్పించేందుకు ఏ మాత్రం భయపడరాదని రేడియో మిర్చి జాకీ షేహాజీ సూచించారు. కార్యక్రమంలో భాగంగా షేహాజీ మాట్లాడుతూ ఫలాన పనిచేయరాదు, ఈ పని మాత్రమే చేయాలి అన్న కట్టుబాట్లు మాని, తాము చేయాలనుకున్న పనులను సంపూర్ణ నమ్మకంతో ధైర్యంగా చేసుకుంటూ బాలికలు ముందుకు సాగాలని సూచించారు.

షాపు యజమానులే
‘స్వచ్ఛ రాయబారులు’
* ప్లాస్టిక్ నిషేధానికి సంపూర్ణంగా సహకరించాలి
* అవగాహన సమావేశంలో కమిషనర్ జనార్దన్ రెడ్డి పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఒక్కో షాపు యజమాని ‘స్వచ్ఛ రాయబారి’గా మారాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణం కల్గిన ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై బుధవారం మాదాపూర్‌లోని సైబర్ కనే్వన్షన్ సెంటర్‌లో మటన్, చికెన్ షాపుల యజమానులు, హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సుమారు వెయ్యి మంది వ్యాపారులు హాజరైన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ 50 మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణం కల్గిన సుమారు ప్లాస్టిక్ కవర్లను ప్రతి నెల కనీసం రెండున్నర కోట్ల పై చిలుకు నగరవాసులు వినియోగిస్తున్నారని వివరించారు. అంతేగాక, వాడిన తర్వాత వీటిని నాలాలు, చెరువుల్లో పారవేయటం వల్ల నీరు కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్ వినియోగ నివారణ నగరంలో మటన్, చికెన్ షాపుల నిర్వాహకుల చేతిలో ఉందని సూచించారు. తమ షాపులకు టిఫిన్ బాక్సుతో వచ్చే వినియోగదారులకు యజమానులు వెయ్యి రూపాయల నగదు పురస్కారాన్ని అందించాలని సూచించారు. తద్వారా అందరిలో అవగాహన పెరిగి ప్లాస్టిక్ నిషేధం సంపూర్ణంగా అమలవుతుందని వివరించారు. 50 మైక్రాన్లకు తగ్గిన ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై ఈ నెల మొత్తం షాపుల యజమానులకు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, నవంబర్ మాసం నుంచి పూర్తి స్థాయిలో జరిమానాలు విధించటం జరుగుతుందని వివరించారు. స్వచ్ఛ హైదరాబాద్ నిర్మాణంలో భాగంగా స్వచ్ఛ మటన్, చికెన్ షాపులకు కూడా ప్రతి నెల ప్రత్యేక అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటికే తమ షాపుకు టిఫిన్ బాక్సుతో వచ్చిన వినియోగదారులకు వెయ్యి రూపాయల నజరానా అందించిన యజమానులను కమిషనర్ ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా ‘మా ఇంటి నేస్తం’ కార్యక్రమం కింద పలువురికి వీధి కుక్క పిల్లలను దత్తతగా అందజేశారు. ఆ తర్వాత షాపుల యజమానులతో స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములవుతామంటూ ప్రతిజ్ఞ చేయించారు.

దేశం గర్వించే దిశగా రాష్ట్భ్రావృద్ధి
పరిపాలనా సౌలభ్యం కోసమే చిన్న జిల్లాలు * మేడ్చల్ జిల్లా మొదటి వార్షికోత్సవ సభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యదవ్
కీసర, అక్టోబర్ 11: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో భారతదేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా మొదటి వార్షికోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చిన్న జిల్లాల ఏర్పాటువల్ల పరిపాలనా సౌలభ్యం కలిగి ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం 31 జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రజల బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. కులవృత్తులపై ఆధారపడిన అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో రాష్ట్రం ఏర్పడిందని, లక్షా 15 వేల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 28 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మిగిలిన ఉద్యోగాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అధికారులకు అనుభవం లేకున్నా, జిల్లాలోని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తున్న మీడియాను కలెక్టర్ అభినందించారు. హరితహారంలో మేడ్చల్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్ధానంలో ఉందని, ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ నెంబర్‌ఒన్, పదవ తరగతి ఫలితాల్లో నాల్గువస్ధానంలో ఉందని ఆనందం వ్యక్తం చేసారు. మేడ్చల్ జిల్లాకు షామీర్‌పేట్ కేంద్ర బిందువని, అందరి ఏకాభిప్రాయంతో అంతాయిపల్లిలో కలెక్టరేట్ సమీకృత భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 38 ఎకరాల్లో కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని మొదటి విడతగా 35 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు. షాపూర్‌జీ పల్లోంజీ నిర్మాణ సంస్ధకు కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని అప్పగించామని, సంవత్సరకాలంలో నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రారంభిస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాల్లోని మూడు జిల్లాలో మేడ్చల్ జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాస్కృతిక సారధి కళాకారులు, జానపద కళా రూపాలు, వివిధ పాఠశాలల విద్యార్ధులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.

సామాజిక పరిజ్ఞానంపై అవగాహన అవసరం
ఎల్‌బినగర్, అక్టోబర్ 11 : మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సామాజిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రదీప్ పేర్కొన్నారు. ప్రపంచ బాలికలు, చిన్నపిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కొత్తపేట బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ‘యంగ్ కానె్సప్ట్స్ ఇండియా ఇన్‌కార్పోరేట్’ కార్యక్రమంపై అనిబీసెంట్ డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థిణులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రదీప్, స్ర్తిల ప్రత్యేక వైద్య నిపుణురాలు డాక్టర్.అంభుజ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రదీప్ మాట్లాడుతూ సమాజంలో రానురాను ఎంతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థులు వాటికి అనుగుణంగా తమలో మార్పును తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యం దిశగా పయనించినపుడే లక్ష్య సాధన సులువుగా అవుతుందని సూచించారు. డాక్టర్ అంభుజ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తవహించాలని, మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ఆధ్వర్యంలో అతిథులను సత్కరించి మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి శ్యాంసుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వీణారెడ్డి, రమాదేవి, విద్యార్థిఋలు పాల్గొన్నారు.

రామంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో 109 ఇళ్లు
ఉప్పల్, అక్టోబర్ 11: రామంతాపూర్ పెద్ద చెరువులోకి వస్తున్న వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. జలదిగ్బంధానికి కారణమేమిటో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని సంబధిత శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఇరిగేషన్ అధికారులు.. సర్వే చేసి చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో మొత్తం 109 ఇళ్లు ఉన్నట్లు నివేదికలో వెల్లడించినట్లు తెలిసింది.
ఉప్పల్ మండలం పరిధిలో ఉన్న రామంతాపూర్ పెద్ద చెరువు ప్రైవేటు స్థలంలో ఉంది. ఇక్కడ గృహాలు తప్ప వ్యవసాయం, కూరగాయల పంటలు మాత్రమే పండించుకోవాల్సి ఉంది. పరిసర ప్రాంతాలు లేఔట్లుగా మారి కాలనీలు ఏర్పడ్డాయి. దశాబ్ధ కాలంలో చెరువులో నీళ్లు లేనపుడు లేఔట్ చేసి ప్లాట్లుగా మార్చడంతో ఎందరో ఇక్కడ కొనుగోలు చేసుకున్నారు. వర్షాకాలంలో వరద నీరు వచ్చినపుడు వరద నీరు చేరి సమీపంలోని లక్ష్మీనగర్, సాయిచిత్రనగర్, రవీంద్రనగర్ కాలనీలు మునిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో వరద నీటిని బయటకు తొలగించాలని ముంపు ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తుండగా కింద ప్రాంతాల ప్రజలు తొలగించవద్దని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. భూగర్భ జలాలు పెరగాలంటే చెరువులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గంగపుత్ర సంఘం ప్రతినిధులు చెరువులో చేపలను పెంచుతున్నారు. వరద నీటిని బయటకు మళ్లించవద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే చెరువు పక్కన బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. కొన్నింటికి అనుమతి ఉండగా మరికొన్ని భవనాలకు అనుమతి లేదు. అనుమతి ఉన్నా విరుద్ధంగా నిర్మించడంతో సమస్య తప్పడం లేదు. ప్రధాన రహదారిలో రాత్రికిరాత్రే చెరువులో మట్టితో నింపి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా మున్సిపల్ అధికారులు ముడుపులు తీసుకుని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, పట్టణ ప్రణాళిక అధికారుల నిర్లక్ష్యంతో ఎఫ్‌టిఎల్ పరిధిలో వెలసిన నిర్మాణాలతో వరద ముంపు సమస్య వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వరద బాధితుల ఆందోళన మేరకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ ఎంవిరెడ్డి చెరువును సందర్శించారు. ముంపునకు కారణాలపై సర్వే చేసి నివేదిక అందజేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు. స్పందించిన ఇరిగేషన్ అధికారులు నిర్వహించిన సర్వేలో ఎఫ్‌టిఎల్‌లో 109 ఇళ్లు ఉన్నట్లు నివేదిక అందజేసినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల ప్రకారం ఇంటి యజమానులకు నష్టపరిహారం అందజేసి ఇళ్లను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సిద్ధమవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
ఆగని ఇంటి నిర్మాణాలు
ఒకవైపు వరద నీటితో చెరువు నిండి ముంపు ప్రాంతాలను ముంచెత్తుతుండగా మరొక వైపు ఇంటి నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుమతి లేకుండా, అనుమతికి విరుద్ధంగా జరుగుతున్న ఇంటి నిర్మాణాలను ఆపకుండా చూసీ చూడనట్లుగా అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలు కలిగిస్తున్నాయి.
బాలుడి మృతికి కారణమైన
సెల్లార్ గుంత యాజమాన్యానికి నోటీసు
ఉప్పల్ గణేష్‌నగర్‌లో బాలుడు ప్రభాస్ మృతికి కారణమైన సెల్లార్ గుంత స్థల యజమాన్యానికి నోటీసులు జారీ చేసేందుకు మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు రంగం సిద్ధం చేశారు. బహుళ అంతస్తుల భవనాల కోసం అనుమతి లేకుండానే సెల్లార్ గుంతలు తీసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తీసిన గుంతల్లో వరద నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. అభం శుభం తెలియని అనాథ పిల్లలు సరదాగా ఈత కోసం వచ్చారు. ఇందులో ఓ బాలుడు నీటిలోకి దిగి మునిగి పోయాడు. ఈత రాకపోవడంతో మరణించిన విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబానికి స్థానికులు సహకరించకపోవడంతో ఎలాంటి ఆందోళనలు చేయలేదు. అయినప్పటికీ బాలుడు మృతికి కారణమైన సెల్లార్ గుంత యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
పోలీసులు వౌనం
సెల్లార్ నీటి గుంతలో పడి బాలుడు మరణించడానికి కారణమెవరో తెలుసుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ జరిపి కారణమెవరో తెలుసుకుని పేద బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మోటారు పంపులతో వరదనీటి తొలగింపు
నిత్యం కురుస్తున్న వర్షాలతో రామంతాపూర్‌లోని పెద్ద చెరువు నిండింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటితో నిండి సమీపంలోని హబ్సిగూడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిని తొలగించి రక్షించాలని డిమాండ్ చేస్తూ ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చేశారు. స్పందించిన అధికారులు చెరువులో నుంచి నీటిని బయటకు తొలగించే కార్యక్రమం స్పీడ్‌ను పెంచారు. 195 హెచ్‌పి సామర్ధ్యం గల విద్యుత్ పంపులను తెప్పించి నీటిని బయటకు పంపిస్తుండటంతో కింద ప్రాంతాలైన ప్రగతినగర్ మీదుగా ఇందిరానగర్, నేతాజినగర్, సాయినగర్ తదితర ప్రాంతాలలో వరద నీరు ఏరులై పారుతోంది. మురుగునీటితో కలిసిన వరద నీరు ఇళ్ల ముందు ప్రవహిస్తుండటంతో కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిలో నుంచి వాహనాలపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడుతున్నామని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలు నిండి ఓవర్‌ఫ్లో కావడంతో సమస్య ఉత్ఫన్నమవుతుందని భావిస్తున్నారు. వరద నీరు ఇళ్ల మధ్యలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కింది ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
పీర్జాదిగూడలో బిజెపి నేతల పర్యటన
పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ నేతలు బుధవారం పర్యటించారు. పార్టీ అధ్యక్షుడు ఎడవెల్లి రఘువర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు సుధ, గీత, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లెల సంతోష్, పవన్ రెడ్డి, క్రాంతి, అభిలాష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సందీప్, హుస్సేన్ స్థానికులతో కలిసి పర్యటించారు.
విహారిక, బచ్‌పన్ స్కూల్, విష్ణుపురి, శ్రీపాద కాలనీ, పర్వతాపూర్ మల్లిఖార్జున్‌గర్, రంగయ్యనగర్, లక్ష్మీనర్సింహ కాలనీ, శ్రీనివాస హిల్స్‌లో పాదయాత్ర నిర్వహించి సమస్యలను తెలసుకున్నారు. ఇళ్లలోకి చేరిన వరద నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారని బుధవారం పురపాలక సంఘం కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. వరద నీటితో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, నడవలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా నిత్యం కురుస్తున్న వర్షాలతో పాతగోడలు కూలిపోయి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి ఇళ్ల మధ్యలో ఉన్న వరద నీటిని తొలగించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు.

పెళ్లి పేరుతో బాలికను తరలించే య