తెలంగాణ

ఎస్‌సి విద్యార్థులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: పాఠశాల స్థాయిలో దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు వారి తల్లిదండ్రుల ఆదాయం పరిమితిని ప్రభుత్వం పెంచింది. తల్లిదండ్రుల ఆదాయం ఏటా గ్రామీణ ప్రాంతాల్లో 65 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 75 వేల రూపాయలు ఉంటే ఇప్పటి వరకు స్కాలర్‌షిప్ మంజూరు చేసేవారు.
ఐదోతరగతి నుండి పదోతరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ నియమావళి వర్తిస్తూ వస్తోంది. తలసరి ఆదాయం పెరగడం తదితర కారణాల వల్ల తల్లిదండ్రుల ఆదాయం పెరగడంతో ఈ నియమావళిలో మార్పులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఆదాయం 1,50,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం రెండు లక్షల రూపాయల వరకు ఉన్నప్పటికీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇవ్వాలని నిర్ణయించారు.
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తరఫున ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.