తెలంగాణ

బిజెపి రైతు భరోసా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలనకు బిజెపి రాష్ట్ర కమిటీ ఏడు బృందాలను నియమించింది. ఈ బృందాలు వికారాబార్, గద్వాలా జిల్లా, నల్లగొండ జిల్లా, భద్రాద్రి జిల్లా, రంగారెడ్డి, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలను సందర్శించి నివేదికలను తయారుచేస్తుంది. ఈ బృందాలు ఈ నెల 12 నుండి మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో పర్యటిస్తాయి. వికారాబాద్‌కు కిషన్‌రెడ్డి, ఆచారి, వై గీత, సుదర్శన్‌రెడ్డి, గద్వాల్ జిల్లాకు ఎన్ రామచందర్‌రావు, వెంకటరమణి, శేరి నర్సింగరావు, గోలి మధుసూధనరెడ్డి, నల్లగొండకు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బి పాపయ్యగౌడ్ వెళ్తారు. భద్రాద్రి జిల్లాలో సంకినేని వెంకటేశ్వరరావు, ఎం ధర్మారావు, జి మనోహర్‌రెడ్డి, కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, ఎస్ జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ఎండల లక్ష్మీనారాయణ, చింతా సాంబమూర్తి, ప్రేమ్‌రాజ్ యాదవ్, వెంకటరెడ్డి, కరీంనగర్ జిల్లాలో చింతల రామచంద్రారెడ్డి, టి రాజేశ్వరరావు, ఎస్ కుమార్, బండి సంజయ్, పి సుగుణాకర్‌రావు, కామారెడ్డి జిల్లాలో గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎస్ మల్లారెడ్డి, కె పుష్పలీల, అల్జాపూర్ శ్రీనివాస్, పర్యటిస్తారని ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు.