తెలంగాణ

సుప్రీం ఆదేశాలు బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి యధేచ్ఛగా మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోందని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఏరులై పారుతున్న మద్యం నియంత్రించాలని నేటి ముఖ్యమంత్రి ఆనాడు శాసనసభలో డిమాండ్లు చేశారని, తీరా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బెల్టుషాప్‌నూ మూసివేయలేదని అన్నారు. అధికారంలో లేనపుడు ఒక రీతిన, ఉన్నపుడు మరో రీతిన టిఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని అన్నారు. ఒక్కో బస్తీలో బెల్టు షాప్‌లు ఒక్కటే ఉండేవని, కాని నేడు గ్రామాల్లో ప్రతి కిరాణా దుకాణాల్లో సైతం మద్యం అమ్మే పరిస్థితి ఏర్పడిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. నియమాలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కొత్త షాప్‌లు ప్రారంభించవద్దని మహిళలు డిమాండ్ చేసినా పట్టించుకునే నాధుడే లేడని పేర్కొన్నారు. వేలం వెర్రితో మద్యం షాప్‌ల ఏర్పాటు చేస్తోందని చెప్పారు. కొన్ని గ్రామాల్లో సహకార సంఘాలకు ఇవ్వాలని గిరిజన ప్రాంతాల వారు కోరినా దానిని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వారందరినీ పక్కన పెట్టి మద్యం మాఫియాకు చెందిన అధికార పార్టీ నాయకులే టెండర్లు వేస్తున్నారని తెలంగాణ ఆదివాసి ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అనేక తండాల నాయకులు కలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకునే నాధుడే లేదని చెప్పారు. పీసా యాక్టు పరిధిలోనే మద్యం దుకాణాలను ప్రారంభించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని అన్నారు. దరఖాస్తు ఫీజు లక్ష రూపాయిలు పెట్టారని, గిరిజన ప్రాంతాల్లో లక్ష రూపాయిలు పెట్టి మద్యం దుకాణానికి దరఖాస్తు చేసే పరిస్థితి ఉందా అని కిషన్‌రెడ్డి నిలదీశారు. నాలుగు లక్షల రూపాయిలు ఇఎండిగా చెల్లించాలని ఇది కుదిరే పనేనా అని అన్నారు.