తెలంగాణ

సూక్ష్మసేద్యానికి సాంకేతిక కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్ర సూక్ష్మసేద్యం ప్రాజెక్టు (టిఎస్‌ఎంఐపి) సజావుగా సాగేందుకు సాంకేతిక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి ఉద్యాన శాఖ కమిషనర్ చైర్మన్‌గా ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కమిటీలో వాలంతరీ డైరెక్టర్, సిఐపిఇటి డైరెక్టర్, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ముఖ్య శాస్తవ్రేత్తలు, క్రిడా ప్రిన్సిపాల్ సైంటిస్ట్, ఉద్యాన వర్సిటీకి చెందిన ఇద్దరు ప్రిన్సిపాల్ సైంటిస్ట్‌లు సభ్యులుగా ఉంటారు. టిఎస్‌ఎంఐపి ఓఎస్‌డి (టెక్నికల్) మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఉద్యాన కమిషనర్ మరో 11 మందిని నామినీలుగా నియమించుకునే అవకాశాన్ని ప్రభుత్వ ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.