తెలంగాణ

వక్ఫ్ ఆస్తులను పరిరక్షిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ , మ్యూటేషన్‌కు అధికారులకు తగిన శిక్షణ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. గురువారం నాడిక్కడ వక్ఫ్ బోర్డు కార్యకలాపాలను ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సలహాదారు ఎకె ఖాన్, కార్యదర్శి ఒమర్ జలీల్, సిఇఓ మన్నన్ ఫరూఖీ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిస్థితి, గ్రాంట్ ఇన్ ఎయిడ్, లీజులు, వక్ఫ్ డాటా నవీకరణ, అద్దెలు, వక్ఫ్ ఆస్తుల సర్వేపై సమగ్ర చర్చ జరిగింది. జిల్లాల విభజన అనంతరం ఆస్తుల మ్యుటేషన్ తొందరగా చేయించాలని, అవసరమైతే రెండు మూడు రోజుల పాటు అధికారులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. రెవిన్యూ వ్యవహారాలను చూసేందుకు కనీసం 50 మంది వక్ఫ్ రిటైర్డ్ అధికారులను పున:నియమించి వారి సేవలు పొందాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. 2014 నుండి నేటి వరకూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ 37 కోట్లు కేటాయించగా, అందులో 14.70 కోట్లు వెచ్చించారని, మిగిలిన మొత్తానికి కూడా జమా ఖర్చులు చూపించాలని అన్నారు. వక్ఫ్ బోర్డులో అక్రమ నియామకాలపై చర్చ రాగా ఈ అంశంపై సిఇఓ నివేదిక కోరామని, అది వచ్చిన తర్వాత దానిపై చర్చిద్దామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అద్దెలు వసూలుపై దృష్టిపెట్టాలని, ప్రతి నెల వక్ఫ్ బోర్డు ఖర్చులు 80 లక్షల వరకూ ఉండగా, ఆదాయం మాత్రం 30 లక్షలు దాటడం లేదని, ప్రతి నెలా 50 లక్షల మేర లోటు ఉంటోందని అన్నారు. తదుపరి అంశాలను ఈ నెల 21న జరిగే మరో సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.