తెలంగాణ

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, అక్టోబర్ 13: వనపర్తి జిల్లా కేంద్రంలోని జాగృతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శివశాంతి(16) కళాశాల గదిలో శుక్రవారం తెల్లవారు జామున ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన బుచ్చన్న సువర్ణ దంపతుల ఏకైక కూతురు శివశాంతి జాగృతి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఇసి ఇంగ్లీష్ మీడియం చదువుతోంది. శివశాంతి కళాశాల హాస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసించేదని, హాస్టల్‌లో ఉండే శివశాంతి శుక్రవారం తెల్లవారు జామున కళాశాల గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకోగా తోటి విద్యార్థులు గమనించి కళాశాల యాజమాన్యానికి తెలుపగా యాజమాన్య సభ్యులు తరగతి గదిలోకి వెళ్లి శివశాంతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విషయాన్ని పోలీసులకు తెలుపగా డిఎస్పీ జోగుల చెన్న య్య, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగశేఖర్‌రెడ్డిలు సంఘటస్థలానికి చేరుకొని విచారించారు. కళాశాల యాజమాన్య సభ్యులెవరూ అక్క డ లేక పోవడం చర్చనీయాంశమయ్యింది. విద్యార్థిని తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి కళాశాల వద్దకు వచ్చి విద్యార్థిని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే మార్చూరిలో ఉన్న విద్యారిన్థి మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. ఇదిలా ఉండగా విద్యార్థిని మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్య త వహించాలని, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కళాశాల ముందు బైఠాయించి విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు.