తెలంగాణ

ఇక ఆటోల క్రమబద్దీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: నగర పోలీసులు నిన్నటి వరకు నగరంలో వాహనదారులు హెల్మెట్, లైసెన్స్‌లు కలిగివుండాలనే నిబంధనపై కఠినంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించారు. తాజాగా రవాణా శాఖ, నగర పోలీసులు కలసి మరో అడుగు ముందుకు వేసి ఆటోల క్రమబద్దీకరణపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఆటోరిక్షాల క్రమబద్ధీకరణపై రెండు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనిపై నగర ట్రాఫిక్ డిసిపి రంగనాథ్ ఖైరతాబాద్‌లోని రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నగరవ్యాప్తంగా సుమారు లక్షా 20వేల అటోలు ఉన్నాయని, ఆటో డ్రైవర్లు, యజమానులు వేర్వేరుగా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిసిపి రంగనాథ్ వెల్లడించారు. సదరు ఇబ్బందులపై గతంలో పలుమార్లు చర్చించినా ఫలితం లేకపోయింది. ఈసారి ఆటోల క్రమబద్ధీకరణపై కఠినంగా వ్యవహరించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఆటో రిక్షాల సమగ్ర సమాచారం ఏ విధంగా ఉండాలో.. పూర్తి సమాచారం ఆర్టీఎ, పోలీస్‌లకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్టు డిసిపి తెలిపారు. కాగా మంగళవారం ఆటోలపై తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమిస్తే ఆటో సీజ్ చేయడంతోపాటు పర్మిట్‌ను రద్దు చేయనున్నట్టు ఆర్టీఎ కో-ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల నుంచి ఆటో మీటర్ చార్జి కంటే అధికంగా డబ్బులు వసూలు చేసినా, మీటర్లు లేవంటూ అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు కమిటీ నిర్ణయించింది.
ఎక్కువ శాతం ఫైనాన్షియర్లవే
ప్రస్తుతం నగరంలోని లక్షా 20 వేల అటోరిక్షాల్లో అధిక శాతం అటోలు ఫైనాన్షియర్లకు చెందినవే. వీటిని ఆటో డ్రైవర్లు రోజూ వారి అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. ఫైనాన్స్ తీసుకొని నడుపుతున్న ఆటోలు వివిధ సందర్భాల్లో నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఆటో డ్రైవర్ల చిరునామాలు, ఫైనాన్స్ ఇచ్చే వారి చిరునామాలు వేర్వేరు ఉండడంతో ఆర్టీఎ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు గానీ వేసిన చలాన్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. రోడ్లపై నిబంధనలు పాటించని ఆటోలు ముందు వరసలో ఉన్నాయి. వీటి కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులను అతిక్రమించేందుకు ఆర్టీఎ, పోలీసులు ఆటోల క్రమబద్ధీకరణ చర్యలకు పూనుకున్నారు. ఫైనాన్షియర్ల పేరుపై ఉన్న ఆటోలను ఆటో డ్రైవర్ల పేర్ల మీద మార్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆర్టీఎ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు సంయుక్తంగా చేపట్టనున్న ఆటోల క్రమబద్ధీకరణకు అందరూ సహకరిస్తారని ట్రాఫిక్ డిసిపి రంగనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.