తెలంగాణ

హెచ్‌సియులో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 13: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి మృతి చెందిన సంఘటన తీవ్ర సంచలన సృష్టించింది. పార్టీ చేసుకోవడానికి వెళ్లి అనంతరం సమీపంలో ఉన్న కుంటలో పడి మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తవౌతున్నాయ. పోలీసులు మాత్రం సంఘటన ప్రదేశంలో ఏం జరిగిందో తెలియాల్సి ఉందని.. పార్టీలో పాల్గొన్న వారి నుండి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. పోలీసులు విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకాం.. జార్ఖండ్‌కు చెందిన ఆకాష్ గుప్తా (24) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీలో ఎంఎ సోషియాలజి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్నేహితులు రవి తేజ, శాంతి, ప్రసన్న సాయి, సందీప్ చాంద్ మరో మహిళ, అబ్బాయిలతో కలసి యూనివర్సీటీలోని మలబార్ కుండ్డమ్ అనే ప్రాంతానికి వెళ్లారు. 6గంటల వరకు ఆరుగురు కలసి మద్యం తాగుతూ సమీపంలో నిర్మాణం కోసం తవ్విన నీటి గుంతలో అడినట్లు సమాచారం. రాత్రి 9గంటల వరకు అక్కడే గడపడంతో పాటు నీటిలో జలకా లాడారు. మద్యం తాగడంతో ఆకాష్ అపస్మారక స్థితికి చేరి నీటి గుంటలోనే ఉండిపోయాడు. ఎంతకీ ఆకాష్ బయటకు రాక పోవడంలో తోటి విద్యార్థులు హెచ్‌సియు సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నీటిలో గాలించి ఆకాష్‌ని బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆకాష్‌ని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఉస్మానియాకు తరలించారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత వారి సమక్షంలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగించారు. ఆకాష్ మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామని గచ్చిబౌలి సిఐ చంద్రకాంత్ తెలిపారు. సంఘటన ప్రదేశంలో ఏమీ జరిగింది... అంత సమయం నిర్మానుష్య ప్రదేశంలో ఎందుకున్నారో తెలియాల్సి ఉందని సిఐ తెలిపారు. ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడా? ఇంకా ఏమైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న విద్యార్థులను విచారించ వలసి ఉందని తెలిపారు. గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..మృతి చెందిన ఆకాష్ గుప్తా