తెలంగాణ

ప్రాజెక్టులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: నాగార్జునసాగర్‌కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 590 అడుగులలకు 547 అడుగులకు నీటి మట్టం చేరింది. నీటి నిల్వ 205 టిఎంసిగా నమోదైంది. శ్రీశైలంప్రాజెక్టులో 885 అడగులకు 883 అడుగుల నీటి మట్టం, 210 టిఎంసి నీటి నిల్వలు చేరాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. గత రెండు రోజులతో పోల్చితే, నీటి ప్రవాహం సగానికి సగం తగ్గింది. కాని అవుట్ ఫ్లోస్ మాత్రం 2.26 లక్షల క్యూసెక్కులు నమోదైంది. ఆల్మట్టి నుంచి 24వేల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్ నుంచి 37 వేల క్యూసెక్కులు, జూరాల నుంచి 1.54లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం విడుదలవుతోంది. కాగా కర్నాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు కూడా పరవళ్లు తొక్కుతోంది. ఈ ప్రాజెక్టులో 100.86 టిఎంసికి 85.58 టిఎంసి నీటి నిల్వలు చేరాయి. తెలంగాణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.