తెలంగాణ

మరో వాయుగుండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: గత పదిహేను రోజుల నుండి భారీ వర్షాలతో అతలాకుతలం అయి కాస్తకోలుకుంటున్న హైదరాబాద్‌కు బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న వాయుగుండం మరో గండంగా మారబోతోందని నిపుణులు భావిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపానుద్రోణి కారణంగా అల్పపీడనం ఏర్పడ్డదని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి అక్టోబర్ 19, అంటే దీపావళి వరకు ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిషా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. వాయుగుండం తీరం దాటిన తర్వాత తీవ్రత పెరుగుతుందా, తగ్గుతుందా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఒక వేళ తీవ్రత పెరిగితే ఆ ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుంది. అక్టోబర్ 20 తర్వాత తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, దాంతో హైదరాబాద్‌లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు ఉపరితల తుపాను ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడి ఉంది. ఈ ప్రభావం కూడా తెలంగాణపై ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇలా ఉండగా నైరుతీరుతుపవనాల ఉపసంహరణ గత 24 గంటల్లో వేగంగా సాగుతోంది. ఈ పవనాలు మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ నుండి వెళ్లిపోతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. గత 24 గంటల్లో రాజేంద్రనగర్‌లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామయంపేట, నవాబుపేటలలో ఐదు సెంటీమీటర్లు, రామగుండంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని వేర్వేరు జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.