తెలంగాణ

హైదరాబాద్‌లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పేలుళ్లు సంభవించవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. మాల్స్, ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించి, బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు వంటివాటిని నిషేధించారు. నగరంలో నిషేధాజ్ఞలు వారంపాటు కొనసాగుతాయని సిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి రాకపోకలు నిర్వహించే వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్, సికిందరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. అదేవిధంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల వద్ద నలుగురు, ఐదుగురు కలసి తిరగవద్దని, ప్రజలు గుమిగూడవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డ్రంకైన్ డ్రైవ్‌తోపాటు నగరశివారుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి తెలిపారు.